Yellampet Municipality: ఎల్లంపేట్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో విస్తృత సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఎల్లంపేట్ మున్సిపాలిటీ(Ellampet Municipality) కాంగ్రెస్(Congress) పార్టీ అధ్యక్షులు విగ్నేశ్వర్ రెడ్డి(Vigneshwar Reddy) ఆధ్వర్యంలో సోను ఫంక్షన్ హాల్‌లో ఈ సమావేశం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ హాజరయ్యారు. ఆయనతో పాటు రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, రాష్ట్ర సీనియర్ నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్ తదితరులు పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
Also Read: Harish Rao: పొమ్మనలేక పొగ పెట్టే ప్రయత్నం? పార్టీలో కీలక నేతగా ఎదిగితే గెంటేయడమేనా?
ఎన్నికల వ్యూహాలు
ఈ సందర్భంగా తోటకూర వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ.. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎల్లంపేట్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలిచే పార్టీ అని, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతుందని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో పార్టీ బలోపేతం, రానున్న ఎన్నికల వ్యూహాలు, కార్యకర్తల బాధ్యతలపై విస్తృతంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పిసరి మహిపాల్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం ఏ బ్లాక్ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, ఎన్‌ఎస్‌యూఐ మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా అధ్యక్షుడు రాహుల్ యాదవ్, మేడ్చల్ మండల్ మాజీ అధ్యక్షుడు రమణా రెడ్డి, ఎల్లంపేట్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Also Read: LIC Jeevan Utsav: సింగిల్ ప్రీమియంతో ఎల్ఐసీ నుంచి కొత్త పాలసీ.. వివరాలు ఇవే

