Congress MLAs: శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడ భూములపై హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. సర్వే నంబర్లు మార్చి కొంతమంది వేల కోట్ల రూపాయల విలువ చేసేప్రభుత్వ భూములను ఆక్రమించారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, రాజేష్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి, మురళీ నాయక్ పిల్ దాఖలు చేశారు. సీనియర్ అడ్వకేట్ చిక్కుడు ప్రభాకర్ దీనిపై వాదనలు వినిపించారు. ఖాజాగూడలోని సర్వే నెంబర్ 119, 112లో ఉన్న 27.18 ఎకరాల భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించినట్టు కోర్టు దృష్టికి తెచ్చారు. దీనికోసం సర్వే నంబర్లను మార్చారని తెలిపారు.
జిల్లా కలెక్టర్ నో అబ్జెక్షన్
నిజానికి ఇది పోరంబోకు భూమి అని పేర్కొన్నారు. 2023లో అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వటంతో జీహెచ్ఎంసీ భవన నిర్మాణలకు అనుమతులు ఇచ్చిందని తెలిపారు. ప్రస్తుతం ఈ భూమిలో ఎనిమిది టవర్లను నిర్మిస్తున్నారన్నారు. ఒక్కో టవర్ లో నలభై ఏడు అంతస్తులు కడుతున్నారని చెప్పారు. దీనికి తోడు కొందరు ఖాజాగూడ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు జరిపారని తెలిపారు.
Also Read; Harish Rao: బనకచర్లతో గోదావరి జలాల్లో తెలంగాణకు నష్టం!
పర్యావరణం కాలుష్యం
చెరువుకు 150 మీటర్ల పరిధిలో ఓ ప్రైవేట్ స్కూల్ కోసం రెడీమిక్స్ ప్లాంట్ పెట్టారన్నారు. దీనివల్ల పర్యావరణం కాలుష్యం అయి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నట్టు తెలిపారు. ఆక్రమణకు గురైన భూమిని స్వాధీనం చేసుకునేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న హైకోర్టు భూమికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మరోసారి వినతిపత్రం ఇవ్వాలని సూచించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
Also Read: KTR Comments: 30 సార్లైనా విచారణకు వస్తా.. జైలుకు సైతం రెడీ.. కేటీఆర్