Hyderabad Rains: గ్రేటర్ హైదరాబాద్‌కు ఎడతెరిపి లేని ముసురు పట్టుకున్నది. గడిచిన రెండ్రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా నగరం తడిసి ముద్దయింది. రాత్రి నుంచి కురుస్తున్న ముసురు అలాగే కంటిన్యూ అవుతోంది. చల్లిటి గాలు వీస్తూ, ముసురు కురుస్తుండటంతో రాకపోకలు సాగించేందుకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రద్దీ మెయిన్ రోడ్లు, ఐటీ కారిడార్‌లోని దాదాపు అన్ని రోడ్లలో ఎక్కడా కూడా నీరు నిల్వకుండా హైడ్రా (Hydra) టీమ్‌లు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి.
Also Read: Gold Rates (25-07-2025): మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్
చర్యలు చేపట్టాలి
ఎక్కడైనా లోతట్టు ప్రాంతాల్లోని మెయిన్ రోడ్లు, జంక్షన్లలో నీరు నిలిస్తే వెంటనే మోటార్లతో తోడేసే విధంగా హైడ్రా (Hydra) ఏర్పాట్లు చేసుకున్నది. కొద్ది రోజుల క్రితం వరకు చిన్న పాటి వర్షానికే రోడ్లపై నీరు నిలిచి ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగే ప్రాంతాలను గుర్తించిన జీహెచ్ఎంసీ, హైడ్రా ముందుగానే సమస్య నివారణ చర్యలు చేపట్టాయి. ఈసారి వర్షాకాలం సహాయక చర్యల బాధ్యతలను హైడ్రాకు అప్పగించటంతో జీహెచ్ఎంసీ, హైడ్రాల మధ్య తలెత్తిన సమన్వయ లోపాన్ని ఉభయ శాఖల కమిషనర్లు కర్ణన్, రంగనాథ్ సరిదిద్దటంతో ఇకపై రెండు శాఖలు సమష్టిగా సహాయక చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.
వాతావరణం బాగా చల్లబడటంతో వివిధ శాఖలు, ప్రైవేటు ఆఫీసుల్లో విధులు నిర్వర్తించే వారు త్వరగా ముగించుకుని గూటికి చేరుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్(Greater Hyderabad) మహానగరానికి మరో రెండ్రోజుల పాటు ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయటంతో వర్షంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా హైడ్రా, జీహెచ్ఎంసీ ముందస్తుగా చర్యలు చేపట్టాయి.
