Commissioner RV Karnan: హైదరాబాద్ కూకట్ పల్లి జోన్ లో పలు అభివృద్ధి పనులను కమీషనర్ ఆర్ వి కర్ణన్ పరిశీలించారు. ఐ డీఎల్ చెరువు నుండి కూకట్ పల్లి బస్ డిపో వరకు ఎస్.ఎన్.డి.పి ద్వారా చేపట్టనున్న నాలాను పరిశీలించారు. మూస పెట్ మెట్రో వద్ద వాటర్ స్టాగ్మేషన్ పాయింట్ పరిశీలించారు. వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
కమిషనర్ కైతాల పూర్ రోడ్డులో రోడ్డు వెడల్పు పనులను పరిశించి, అంబేద్కర్ నగర్ కోర్టు సముదాయంలో నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని జల మండలి పైపు లైన్ ఉన్న పక్షంలో జలండలి ద్వారానే పనులు చేయించాలని జోనల్ కమిషనర్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. కైలాస వాసం గ్రేవ్ యార్డు నిర్వహణ పై కమిషనర్ ఆరా తీసారు. జంతు సంరక్షణ కేంద్రం పరిశీలన ఆపరేషన్ గది జన, కుటుంబ నియాత్రణ శస్త్ర చికిత్స చేసిన కుక్కల గుర్తింపుగా ఏ చర్యలు ఉన్నాయని కమీషనర్ వివరణ అడిగారు.
Also Read: Hydra Demolition: గచ్చిబౌలిలో హైడ్రా కూల్చివేతలు.. ఆక్రమణలు తొలగింపు!
షాపూర్ లో మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులను పరిశీలించి, గాజుల రామారం జి హెచ్ ఎం సి స్పోర్ట్ కాంప్లెక్స్ కమీష్ నర్ పరిశించారు. అర్బన్ ఫారెస్ట్ పార్క్ సందర్శన కమిషనర్ వెంట జోనల్ కమిషనర్ అపూర్వ్ చౌహాన్, మరాయు యస్ ఈ చిన్న రెడ్డి, డిప్యూటీ కమీషనర్ ఈ ఈ రమేష్, శ్రీనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.