Hydra Demolition: హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో హైడ్రా కూల్చివేతలను చేపట్టింది. ఆక్రమణల తొలగింపునకు గాను సంధ్య కన్వెన్షన్ ప్రాంతంలోని ఫెర్టిలై జర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ cooperative housing సొసైటీ లే ఔట్ లో అక్రమ కట్టడాలను భారీ బందోగబస్తు పోలీసులు నడుమ కూల్చి వేస్తుంది. లేఅవుట్ నామరూపాలు లేకుండా రోడ్స్, పార్క్స్ ను కలుపుతూ పలు ఆక్రమణలను, అనుమతులు లేని కట్టడాలను హైడ్రా తొలగిస్తున్నారు.
రహదారులను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారంటూ వచ్చిన ఫిర్యాదులతో పాటు లేఅవుట్లో మా ప్లాట్లు కనిపించకుండా నిర్మాణాలు చేపట్టారంటూ ప్లాట్ యజమానులు ఫిర్యాదులు చేశారు. సంధ్య కన్వెన్షన్ మినీ హాల్ తో పాటు , వంటగదులు, రెస్ట్ రూమ్ లను మరియు లేఅవుట్ ను ఆక్రమించి నిర్మించిన రేకుల ఫెన్సింగ్, జీ ప్లస్ 2 గా నిర్మించిన 3 ఐరన్ షడ్ లను హైడ్రా కూల్చివేసింది.
Also Read: Etela Rajender: ఆయనతో నాకు విభేదాలు లేవు.. ఎంపీ ఈటల రాజేందర్!