H-Citi: హైదరాబాద్ మహానగరంలో రోజురోజుకి పెరుగుతున్న ట్రాఫిక్, రద్దీ నుంచి వాహనదారులకు ఉపశమనం కల్గించేందుకు సర్కారు ప్రతిపాదించిన హెచ్ సిటీ(H-Citi) పనుల కోసం జీహెచ్ఎంసీ(GHMC) పది మంది అధికారులతో స్పెషల్ డిజైనింగ్ వింగ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ ఆర్.వి. కర్ణన్(Commissioner R.V. Karnan)ఆదేశించారు. ఈ వింగ్ ఆయా ప్రాజెక్టుల పనులకు సంబంధించిన డిజైనింగ్ ప్రక్రియలను మరింత వేగవంతం చేయాలని సూచించారు. ముఖ్యంగా సిటీలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి(CM revanth Redy) శంకుస్థాపన చేసిన ఈ పనులు జరిగే ప్రాంతాల్లో అధికారులు, ఇంజనీర్లు ఖచ్చితంగా ప్రమాద నివారణ చర్యలను అమలు చేయాలని సూచించారు.
సుదీర్ఘంగా సమీక్ష
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పనుల్లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేసేందుకు వీలుగా ప్రాజెక్ట్ వారిగా టైమ్ లైన్(Time Line) ఇవ్వాలని కూడా కమిషనర్ ఇంజనీర్లను ఆదేశించారు. జీహెచ్ఎంసీ(GHMC) ప్రధాన కార్యాలయంలో ఆయన మంగళవారం హెచ్ సిటీ పనులపై దాదాపు మూడు గంటలకు పైగా సమీక్ష నిర్వహించారు. ప్లానింగ్, భూ సేకరణ అధికారులతో కమిషనర్ సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఇంజనీరింగ్ అధికారులు పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఒక్కో ప్రాజెక్ట్ పురోగతిని కమిషనర్ కు వివరించారు. క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న ప్రతిబంధకాలు, సవాళ్లు, పెండింగ్ పనులు, అందుకు కారణాలను తెలిపారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పనుల వేగంగా పూర్తికి కమిషనర్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
Also Read: Mahabubabad District: నకిలీ పాసుపుస్తకాల ముఠా సభ్యులు అరెస్ట్..ఎక్కడంటే..?
పెండింగ్ భూ సేకరణ
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రాజెక్ట్ ల పూర్తికి నిధుల కొరత లేదని క్లారిటీ ఇచ్చారు. యుటిలిటీ షిఫ్టింగ్, పెండింగ్ భూ సేకరణ యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. వివాదాలేమైనా ఉంటే ప్రభుత్వం వద్ద పెండింగ్ ఉంటే, తనకు తెలియజేస్తే వెంటనే క్లియర్ చేయిస్తామని చెప్పారు. మెట్రో(Mertro), రైల్వే(Railway) అధికారులతో సమన్వయం అవసరం ఉంటే జోనల్ కమిషనర్ లకు తెలియజేయాలన్నారు. పనులు జరిగే ప్రదేశాలలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ పోలీస్ లతో ముందుస్తుగా ప్లాన్ చేసుకోవాలని సూచించారు.
ఉన్నతాధికారుల నేతృత్వంలో
హెచ్ సిటీ(H-Citi) పనులకు పనులకు సంబంధించిన డిజైన్ ల రూపకల్పనకు ప్రైవేట్ కన్సల్టెంట్(Private consultant)ల పై ఆధారపడటాన్ని తగ్గించేందుకు, డిజైన్లను వేగంగా ఖరారు చేసేందుకు సీనియర్ ఇంజనీరింగ్ ఉన్నతాధికారుల నేతృత్వంలో ఐఐటీ(IIT), ఎన్ఐటీ(NIT) వంటి ప్రతిష్టాత్మక సంస్థలలో విద్యనభ్యసించిన జీహెచ్ఎంసీ(GHMC) ఇంజనీర్లు పది మందితో ఇన్ హౌజ్ డిజైన్ వింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ ప్రకటించారు. ఈ సమీక్షలో జోనల్ కమిషనర్లు అనురాగ్ జయంతి, బోర్కడే హేమంత్ సహదేవ్ రావు, హేమంత్ పాటిల్, శ్రీనివాస్ రెడ్డి, రవి కిరణ్, ప్రాజెక్ట్స్ చీఫ్ ఇంజనీర్ భాస్కర్ రెడ్డి, చీఫ్ సిటీ ప్లానర్ శ్రీనివాస్, స్థల సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాములు నాయక్, ఎస్ఈ, ఈఈ లు పాల్గొన్నారు.
Also Read: H-Citi Project: టెండర్లు సరే.. పనుల మాటేంటీ?.. మొదలుకాని హెచ్‌సిటీ పనులు