GHMC Commissioner: రాష్ట్రంలోనే అతి పెద్ద స్థానిక సంస్థ జీహెచ్ఎంసీ(GHMC) వర్షాకాలం అంటు వ్యాధులు ప్రబలకుండా, రోడ్లపై చెత్త కుప్పలు నిల్వ ఉండకుండా కొద్ది రోజులుగా నిర్వహిస్తున్న శానిటేషన్ మాన్సూన్ స్పెషల్ డ్రైవ్(Sanitation Monsoon Special Drive) లో వివిధ విభాగాల వారీగా అన్ని విభాగాలకు అప్పగించిన పనులపై డైలీ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్న కమిషనర్ విభాగాల వారీగా పనితీరుపై సైలెంట్ అబ్జర్వేషన్(Silent Observation) పెట్టినట్లు సమాచారం. గ్రేటర్ ప్రజలకు జీహెచ్ఎంసీ అందిస్తున్న శానిటేషన్ వంటి ముఖ్యమైన అత్యవసరమైన సేవ శానిటేషన్‌తో పాటు దోమల నివారణ, వర్షానికి ధ్వంసమైన రోడ్ల కారణంగా ప్రజలకెలాంటి ఇబ్బందులు కలగరాదన్న ఆలోచనతో రోడ్ సేఫ్టీ(Road Safety) కోసం కూడా గుంతలను పూడ్చే కార్యక్రమాన్ని తీసుకున్న సంగతి తెల్సిందే.
గత నెల 29వ తేదీన మొదలైన ఈ డ్రైవ్ లో భాగంగా డైలీ ఉదయం అయిదున్నర గంటల నుంచి ఒంటి గంట వరకు అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది నిర్వహించాల్సిన విధులకు సంబంధించి ఇప్పటికే ప్రత్యేకమైన షెడ్యూల్‌ను జారీ చేసిన కమిషనర్, ఫీల్డు లెవెల్‌లో ఈ పనులెలా జరుగుతున్నాయన్న విషయాన్ని పరిశీలిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఒక ప్రాంతంలో సకాలంలో చెత్తను తరలించనందుకు ఓ ఎస్ఎఫ్ఏ(SFA) ను విధుల్లో నుంచి కూడా తొలగించినట్లు తెలిసింది.
ఆశించిన స్థాయిలో పనితీరు లేని వారిపై
శానిటేషన్‌తో పాటు దోమల నివారణ, అంటు వ్యాధులు ప్రబలకుండా ప్రజల్లో అవగాహన పెంచేందుకు రిసోర్స్ పర్సన్స్, స్వయం సహాయక బృందాల కార్యక్రమాలపై ఎంటమాలజీ(Entomology), కుక్కల నివారణ, వీధి కుక్కలకు స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ పనులపై వెటర్నరీ విభాగం చేపట్టిన చర్యలను, రోడ్ సేఫ్టీ విషయంలో గుంతలను పూడ్చటంలో ఇంజనీరింగ్ విభాగం, వర్షకాలం డేంజర్‌గా మారిన పాత కాలపు శిథిల భవనాలపై చర్యలు తీసుకోవాల్సిన టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించి నిర్వహిస్తున్న పనులను కమిషనర్ ఫీల్డు లెవెల్‌లో పరిశీలిస్తున్నట్లు సమాచారం. విభాగాల వారీగా విభాగాధిపతులు, ఫీల్డు లెవెల్ సిబ్బంది విధులను స్పెషల్ డ్రైవ్ కు తగిన విధంగా నిర్వహిస్తున్నారా? లేదా? అన్న కోణంలో విశ్లేషిస్తున్నట్లు సమాచారం.
Also Read: Bhadrachalam: పుణ్యక్షేత్రంలో పాడు పనులు.. నిద్రపోతున్న నిఘా వ్యవస్థ
స్పెషల్ డ్రైవ్ లో విభాగాల వారీగా చేపట్టిన చర్యలను పరిశీలిస్తున్న కమిషనర్ శానిటేషన్ పైనే ప్రధానంగా ఫోకస్ చేసినట్లు సమాచారం. విభాగాల వారీగా పనితీరును పరిశీలిస్తున్న కమిషనర్ ఈ డ్రైవ్‌లో ఆశించిన స్థాయిలో పనితీరు లేని వారిపై ఈ నెల 8వ తేదీన డ్రైవ్ ముగిసిన తర్వాత చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు పరిపాలనపరంగా దృష్టి సారించి, పలు సంచలన నిర్ణయాలు తీసుకున్న కమిషనర్ ఫీల్డు లెవెల్ లో సిబ్బంది, వారి పనితీరును పర్యవేక్షించే అధికారుల పనితీరును అంచనా వేసేందుకు ఈ డ్రైవ్ ను నిర్వహిస్తున్నట్లు కూడా తెలిసింది.
పార్కులపై స్పెషల్ ఫోకస్
శానిటేషన్ మాన్సూన్ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా శానిటేషన్, దోమల నివారణతో పాటు బయోడైవర్శిటీ విభాగం పార్కుల నిర్వహణకు చేపట్టిన చర్యలను కమిషనర్ నేరుగా సందర్శించి, పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా పార్కులో నిర్వహణ పనులపై దృష్టి సారించాలని ఆదేశించారు. చాలా పార్కుల్లో కొద్ది రోజుల వరకు కూడా ఎంట్రీ ఫీజు, పార్కింగ్ ఫీజు(Parking Fee)ల వసూళ్లను టెండర్ ద్వారా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే వారు. పలు పార్కుల్లో ఈ బాధ్యతలను అప్పగించేందుకు రెండు, మూడు సార్లు టెండర్ల ప్రక్రియ చేపట్టినా, ఎవరూ ముందుకు రాకపోవటంతో ఈ బాధ్యతలను నేరుగా జీహెచ్ఎంసీ(GHMC)యే నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. కానీ పార్కుల్లో ఎంట్రీ ఫీజు టికెట్, పార్కింగ్ ఛార్జీలను జీహెచ్ఎంసీ సిబ్బంది వసూలు చేస్తే అవి నేరుగా బల్దియా ఖజానాకు చేరుతాయా? లేక సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తుందా? అన్న అనుమానాలు సైతం నెలకొన్నాయి.
Also Read: Child Marriage: రంగారెడ్డి జిల్లాలో దారుణం.. 13 ఏళ్ల బాలికకు 40 ఏళ్ల వ్యక్తితో వివాహం!