Mayor Sudharani (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Mayor Sudharani: అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి: సుధారాణి

Mayor Sudharani: వర్షాకాలం నేపథ్యంలో గ్రేటర్ మున్సిపాల్టీ ఉద్యోగులు నిత్యం అదుబాటులో ఉండడంతోపాటు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, మురుగు కాలువల జంక్షన్ లపై వెంటనే మెష్‌లు ఏర్పాటు చేయాలని గ్రేటర్ వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి(Sudharani) అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పురపాలికల్లో చేపడుతున్న 100 రోజుల కార్యక్రమాల్లో భాగంగా సంబంధిత అధికారులతో కలిసి వరంగల్(Warangal) పట్టణంలోని పలు మురుగు కాలువల జంక్షన్లను, మురుగునీరు నిలిచే ప్రాంతాలను మేయర్ శ్రీమతి గుండు సుధారాణి క్షేత్రస్థాయిలో పరిశీలించి విధులు సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.

Also Read: Harish Rao: బాధితులకు కోటి రూపాయల పరిహారం అందేనా: హరీష్ రావు

వరద నీరు సాఫీగా వెళ్లేలా
మేయర్ వరంగల్(Warangal) పట్టణంలోని బట్టల బజార్, కృష్ణ కాలనీ, పోచమ్మ మైదాన్, కాశిబుగ్గ, డి మార్ట్ ముందు, చార్బోలి, ఎల్లమ్మ టెంపుల్ దగ్గర ప్రాంతాల్లో మురుగు కాలువల జంక్షన్ లను, మురుగునీరు నిలిచే ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ వరంగల్ నగరంలో దాదాపు 100 మురుగు కాలువ జంక్షన్ ఉన్నాయని, వాటిపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి మెష్ ఏర్పాటు చేయడంతో పాటు ట్రైన్ వరద నీరు సాఫీగా వెళ్లేలా ప్రతిరోజు శుభ్రం చేయాలన్నారు.

ఐసీసీసి కు మ్యాపింగ్ చేసి, క్రమం తప్పకుండా మానిటరింగ్ చేయాలన్నారు. మురుగు కాలువలపై కల్వర్టులు లేని చోట తక్షణమే నిర్మించుటకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మేయర్ వెంట సీఎం హెచ్ ఓ డాక్టర్ రాజారెడ్డి, ఈ ఈ శ్రీనివాస్, ఎంహెచ్ ఓ డాక్టర్ రాజేష్, డిఈ లు, ఏఈలు సానిటరీ సిబ్బంది ఉన్నారు.

Also Read: Fertility Centers: తనిఖీలు లేవ్.. రెయిడ్స్ లేవ్.. చెలరేగిపోతున్న ఫర్టిలిటీ సెంటర్లు

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు