CM Revanth Reddy: హైదరాబాద్‌లో సాఫ్రన్ ఎయిరోస్పేస్ ఫెసిలిటీ సెంటర్‌ను నెలకొల్పడం తెలంగాణ అభివృద్ధిలో ఒక మైలురాయిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఫ్రాన్స్‌కు చెందిన సాఫ్రన్ (SAFRAN) సంస్థ, ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా (SAESI)తో కలిసి హైదరాబాద్ జీఎంఆర్ ఎయిరోపార్క్ (ఎస్ఈజెడ్) లో నెలకొల్పిన ఫెసిలిటీ సెంటర్ ను ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ దేశంలోనే ప్రధాన ఎయిరోస్పేస్, డిఫెన్స్ హబ్‌గా మారిందని పేర్కొన్నారు.
హైదరాబాద్‌ను డిఫెన్స్, ఎయిరోస్పేస్ కారిడార్‌గా ప్రకటించాలని ప్రధాని మోదీని ఈ సందర్భంగా రేవంత్ కోరారు. ఎయిరోస్పేస్ రంగానికి సంబంధించి సాఫ్రన్, బోయింగ్, ఎయిర్ బస్, టాటా, భారత్ ఫోర్జ్ వంటి సంస్థలు హైదరాబాద్‌ను కేంద్రంగా ఎంచుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తెలంగాణపై ఎంతో నమ్మకంతో Safran గ్రూపు తన ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంపిక చేసుకున్నందుకు అభినందనలు తెలియజేశారు. ఈ సెంటర్ ఏర్పాటు ఎయిరోస్పెస్, రక్షణ రంగంలో తెలంగాణ అభివృద్ధిలో ఒక మైలురాయిగా నిలుస్తుందని సీఎం రేవంత్ అన్నారు. ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసులను అందించడంలో దేశంలోనే ఇది మొట్టమొదటి సెంటర్ ని సీఎం పేర్కొన్నారు.
It was a historic day for Hyderabad, Telangana, and India when Hon'ble Prime Minister Shri Narendra Modi ji virtually inaugurated the Safran Aircraft Engine Services facility — the first-ever Maintenance, Repair and Overhaul (MRO) center for LEAP engines in India.
With an… pic.twitter.com/jqKBYjF3Pf
— Revanth Reddy (@revanth_anumula) November 26, 2025
సాఫ్రన్ దాదాపు 1300 కోట్ల రూపాయల ప్రారంభ పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ సెంటర్ ద్వారా వెయ్యి మందికిపైగా నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులు, ఇంజనీర్లకు ఉపాధి లభిస్తుందని సీఎం రేవంత్ అన్నారు. ‘పెట్టుబడులను ఆహ్వానించడం, పారిశ్రామికాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రగతిశీల విధానాలను అవలంభిస్తోంది. తెలంగాణ అమలు చేస్తోన్న ఎస్ఎంఈ విధానం దేశంలోనే అత్యుత్తమమైన వాటిల్లో ఒకటిగా నిలిచింది. ఇక్కడి ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, ఎయిరోస్పేస్ పార్కులు, ఎస్ఈజెడ్‌లు ప్రపంచ స్థాయి ప్రముఖ కంపెనీల నుంచి భారీ పెట్టుబడులను ఆకర్షించాయి’ అని సీఎం రేవంత్ అన్నారు.
Also Read: India – Pakistan: అయోధ్యలో ధ్వజారోహణంపై పాక్ అక్కసు.. తీవ్రస్థాయిలో మండిపడ్డ భారత్
ఎయిరోస్పేస్ రంగంలో గతేడాది ఎగుమతులు రెట్టింపయ్యాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గడిచిన 9 నెలల కాలంలో ఎగుమతులు 30 వేల కోట్లకు పైగా చేరుకున్నాయని చెప్పారు. తద్వారా మెుదటి స్థానంలో ఉన్న ఫార్మాను అధిగమించాయని పేర్కొన్నారు. ఎయిరోస్పేస్ రంగంలో తెలంగాణ కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి అవార్డును సైతం పొందిందని రేవంత్ చెప్పారు. ‘రాష్ట్రంలో నెలకొల్పిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా విమానాల నిర్వహణ అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చే అంశంపై ప్రభుత్వం దృష్టి పెడుతోంది. నైపుణ్యతను మెరుగుపరచడానికి టాటా టెక్నాలజీస్ సంస్థ భాగస్వామ్యంతో రాష్ట్రంలోని 100 ఐటీఐలను అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్లుగా తీర్చిదిద్దాం’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

