Hydra(image credit:X)
హైదరాబాద్

Hydra: నేడు హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభం.. ప్రత్యేకతలు ఇవే..

Hydra: సర్కారు ఆస్తులైన చెరువులు, కుంటలు, నాలాలకు ఆక్రమణల నుంచి విముక్తి కల్గించి, ఆస్తులను కాపాడుతున్న హైడ్రా స్పెషల్ పోలీస్ స్టేషన్ ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. రాణిగంజ్ లోని బుద్దభవన్ ను ఆనుకుని ఉన్న భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ తో కలిపి రెండు అంతస్తు లో ఏర్పాటు చేశారు.

సర్కారు ఆస్తులను కాపాడే క్రమంలో అక్కడక్కడ ఆస్తులు కబ్జాలకు, ఆక్రమణకు గురైనట్లు నిర్థారించిన తర్వాత హైడ్రా కూల్చివేతలు చేపట్టినా, అందుకు బాధ్యులైన వారిపై అమీన్ పూర్, శేరిలింగంపల్లి తదితర పోలీస్ స్టేషన్లలో ఇప్పటి వరకు నమోదైన 48 కేసులు హైడ్రా పోలీస్ స్టేషన్ కు బదిలీ చేసే అవకాశమున్నట్లు తెలిసింది. వీటిలో ముఖ్యంగా నార్నె సంస్థతో పాటు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తదితరులపై నమోదైన కేసులున్నాయి.

నాంపల్లి కోర్టు కాంప్లెక్స్ లో హైడ్రా కోర్టు

హైడ్రాకు పోలీస్ స్టేషన్ లేకపోవటంతో కబ్జాలకు పాల్పడిన ఆక్రమణదారులపై హైడ్రా వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేయించింది. పోలీస్ స్టేషన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆక్రమణలు, కబ్జాలకు సంబంధించిన హైడ్రానే నేరుగా కేసులు నమోదు చేసి, నాంపల్లి కోర్టు కాంప్లెక్స్ లో హైడ్రాకు కేటాయించిన ప్రత్యేక కోర్టు ముందు నిందితులను హాజరు పేర్చనున్నారు.

హైడ్రాకు స్పెషల్ గా ఓ పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేయాలన్న ఆలోచన హైడ్రాను ఏర్పాటు చేసిన కొద్దిరోజులకే సర్కారుకు వచ్చినా, కేసులు నమోదైన తర్వాత నిందితులను హాజరు పరిచేందుకు ప్రత్యేక కోర్టు అవసరమన్న విషయాన్ని గుర్తించి, ఆ దిశగా చేసిన ప్రయత్నాలు ఫలించి, చివరకు నాంపల్లి కోర్టు భవనంలో హైడ్రాకు స్పెషల్ కోర్టును కేటాయించటంతో ఇక పోలీస్ స్టేషన్ ను వీలైనంత త్వరగా యాక్షన్ లోకి తీసుకురానున్నారు.

Samantha: న్యూ బిగినింగ్స్ అంటూ రాజ్ నిడిమోరుతో సమంత పోస్ట్.. గుడ్ న్యూస్ చెప్పబోతుందా?

ఇప్పటికే ఎస్పీ, ఏఎస్పీ వంటి క్యాటిగిరీలతో పాటు కానిస్టేబుల్ మొదలుకుని హోం గార్డు వరకు సర్కారు ఇటీవలే హైడ్రాకు మొత్తం 1050 మంది సిబ్బందిని కేటాయించిన సంగతి తెల్సిందే. ఆ తర్వాత కూల్చివేతలు చేపట్టేందుకు హైడ్రా అత్యాధునిక హైడ్రాలిక్ జేసీబీలు, కట్టర్లను కూడా సమకూర్చుకుని కబ్జాదారుల భరతం పట్టేందుకు సిద్దంగా ఉంది. 8న హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభమైన తర్వాత సర్కారు ఆస్తుల పరిరక్షణకు హైడ్రా చేసిన ప్రయత్నాలు చట్టబద్దంగా ముమ్మరం కానున్నాయి.

నాలుగు శాఖల ఆధ్వర్యంలో దర్యాప్తులు

హైడ్రా పోలీస్ స్టేషన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఒకే కబ్జాలు, ఆక్రమణలకు సంబంధించిన ఫిర్యాదులను ఒకే చోట నాలుగు శాఖలు పరిశీలించే వెసులుబాటు కలగనుంది. ముఖ్యంగా హైడ్రా పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుల్లో వాస్తవమెంత అన్న విషయాన్ని తొలుత బేరీజు వేసేందుకు హైడ్రా పోలీస్ స్టేషన్ లోనే రెవెన్యూ, ఇరిగేషన్, జీహెచ్ఎంసీ, లీగల్ విభాగాలకు చెందిన అధికారులు అందుబాటులో ఉండే అవకాశముంది. ఈ నాలుగుశాఖలు క్రాస్ వెరిఫై చేసిన తర్వాత అందుకు ఫిర్యాదులో పేర్కొన్న విధంగా కబ్జాలను, ఆక్రమణలను టెక్నికల్ గా నిర్థారించుకునేందుకు హైడ్రా పోలీస్ స్టేషన్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ విభాగం సహకారం తీసుకోనుంది.

ఇప్పటికే 1050 మంది వివిధ హోదాల్లోని పోలీస్, ఇరిగేషన్, రెవెన్యూ విభాగాలకు చెందిన ఆఫీసర్లు, సిబ్బందిని హైడ్రాకు కేటాయించగా, తాజాగా వరంగల్ జిల్లా కాజీపేట ఏసీపీగా పని చేస్తున్న ఓ పోలీసు అధికారి ఏసీపీ పి.తరుమలేశ్ ను హైడ్రాకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. హైడ్రా ఏర్పాటు చేస్తున్న పోలీసు స్టేషన్ కి సంబంధించిన వ్యవహారాలన్నింటినీ ఈ ఆఫీసరే పర్యవేక్షించనున్నట్లు సమాచారం.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు