CM Revanth Reddy (Image Source: Twitter)
హైదరాబాద్

CM Revanth Reddy: రెండ్రోజుల్లో మిస్ వరల్డ్ పోటీలు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

CM Revanth Reddy: తెలంగాణలో మే 7 నుంచి జూన్ 2 మధ్య మిస్ వరల్డ్ – 2025 పోటీలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt).. విదేశాల నుంచి వచ్చే అతిథులకు ఎలాంటి అసౌఖర్యం కలగకుండా ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. మరో రెండ్రోజుల్లో మిస్ వరల్డ్ వేడుకలు మెుదలు కానున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి.. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ (Command Control Office) లో సమీక్ష సమావేశం నిర్వహించారు.

హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో జరిగిన సమీక్షా సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao), పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasa Reddy), సీఎస్ రామకృష్ణరావు (CS Rama Krishna Rao) హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. 72వ మిస్ వరల్డ్ పోటీల్లో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా చూసుకోవాలని సూచించారు. ముఖ్యంగా అతిథుల సందడి నెలకొనే ఎయిర్ పోర్టులు, హోటళ్ల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని దిశా నిర్దేశం చేశారు. భద్రతా ఏర్పాట్ల విషయంలో అలసత్వం వహించవద్దని ఆదేశించారు.

Also Read: MLA Adi Srinivas: గల్ఫ్ ఉద్యోగం పేరుతో ఎమ్మెల్యేకు ఫోన్.. బెండ్ తీయించిన నేత!

ఇక మిస్ వరల్డ్ – 2025 పోటీల విషయానికి వస్తే అవి మే 7- జూన్ 2 తేదీల మధ్య జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో దాదాపు 140 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారని సమాచారం. అలాగే 3,000 మంది అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు సైతం హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణలోని 10 ప్రాంతాల్లో నిర్వహించనున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో అందాల పోటీలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి. 12న బుద్ధభవన్ లో ఆధ్యాత్మిక పర్యటన, 13న చౌమహల్లా ప్యాలెస్ లో అతిథులకు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనుంది.

Also Read This: Miss World 2025: ప్రపంచ సుందరులు వచ్చారు.. ప్రజలకు మాత్రం ఎల్ఈడీ స్క్రీన్‌ పరిమితం?

Just In

01

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!