MLA Adi Srinivas (Image Source: Twitter)
తెలంగాణ

MLA Adi Srinivas: గల్ఫ్ ఉద్యోగం పేరుతో ఎమ్మెల్యేకు ఫోన్.. బెండ్ తీయించిన నేత!

MLA Adi Srinivas: ఉద్యోగం కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి అమాయకపు యువత మోసపోతున్న సంగతి తెలిసిందే. ఆకర్షణీయమైన జీతంతో పాటు మంచి హోదా ఉన్న ఉద్యోగం ఇప్పిస్తామంటూ పలు ఏజెన్సీలు వారిని మోసం చేస్తున్నాయి. ఎప్పుడు సామాన్యులను మాత్రమే టార్గెట్ చేసే ఈ ముఠా.. ఈ సారి ఏకంగా ఓ ఎమ్మెల్యేను తమ ఉచ్చులో దింపాలని అనుకుంది. సదరు ఎమ్మెల్యే చాకచక్యంగా వ్యవహరించడంతో గల్ఫ్ ట్రావెల్ దందా గుట్టు రట్టయ్యింది.

అసలేం జరిగిందంటే?
తెలంగాణలోని వేముల నియోజక వర్గ ఎమ్మెల్యే అది శ్రీనివాస్.. గల్ఫ్ ట్రావెల్ దందాను బయటపెట్టారు. ఫోన్ కాల్ తో అమాయకపు యువకులను మోసం చేస్తున్న వారిని కటకటాలపాలు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. సారంగాపూర్ మండలం రంగపేట గ్రామానికి చెందిన నవీన్.. ఓ యువతిని ఉద్యోగిగా పెట్టుకుని జిల్లా కేంద్రంలోని జంబిగద్దె ప్రాంతాల్లో అనుమతి లేకుండా లక్ష్మీ గల్ఫ్ ట్రావెల్స్ (Lakshmi Gulf Travels) నిర్వహిస్తున్నాడు. ఆమె ద్వారా అమాయక ప్రజలకు ఫోన్లు చేసి విదేశాలకు పంపిస్థానని డబ్బులు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడున్నాడు.

ఎమ్మెల్యేకు ఫోన్ కాల్!
సాధారణంగా అమాయకులు చేస్తున్నట్లు సదరు యువతీ.. వేములవాడ ఎమ్మెల్యే అది శ్రీనివాస్ కు ఫోన్ చేసింది. గల్ఫ్ పంపిస్తానని నమ్మబలికింది. ఎమ్మెల్యే తనకెందుకు ఫోన్ చేశావని అడగ్గా ఆ యువతి ఎమ్మెల్యే పైనే ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఎమ్మెల్యే.. ఎలాగైన ఈ ఏజెన్సీ గుట్టు రట్టు చేయాలని సంకల్పించారు.

Also Read: DMK MP: డీఎంకే ఎంపీకి తప్పిన పెను ముప్పు.. నెట్టింట వీడియో వైరల్

ఎస్పీకి ఫిర్యాదు
గల్ఫ్ ఉద్యోగం పేరిట తనకొచ్చిన ఫోన్ కాల్ గురించి నేరుగా జిల్లా ఎస్పీని కలిసి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వివరించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆదివారం రాత్రి ట్రావెల్ ఏజెన్సీ ఆఫీసుపై దాడి చేశారు. కార్యాలయంలోని రికార్డులన్నీ పరిశీలించారు. అయితే సదరు ట్రావెల్స్ కు ఎలాంటి అనుమతి లేదని గుర్తించారు. దీంతో నిర్వహకుడు నవీన్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Also Read This: CPI Narayana On Nagarjuna: హీరో నాగార్జునపై సీపీఐ నేత సంచలన ఆరోపణలు.. బాబోయ్ మరీ ఈ స్థాయిలోనా!

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?