CM Revanth reddy: కాశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ జాతీయ కాంగ్రెస్ పార్టీ క్యాండిల్ ర్యాలీకి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు సైతం కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీకి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తో పాటు, టీపీసీసీ ఛైర్మన్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Reddy) హాజరయ్యారు. ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi)తో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ (Ponguleti Srinivasa Reddy) తదితురులు పాల్గొన్నారు.
Also Read: Congress on KCR: గులాబీ దండుకు వరంగల్ ఫీవర్.. ఒకటే ప్రశ్నలు.. ఆన్సర్లు కష్టమే!
హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరా గాంధీ విగ్రహం వరకూ సీఎం రేవంత్ ఈ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సీఎం స్వయంగా పాల్గొనడంతో భారీ ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు పీపుల్స్ ప్లాజాకు తరలివచ్చారు. రేవంత్ తో పాటు క్యాండిల్స్ పట్టుకొని ఇందిరా గాంధీ విగ్రహం వరకూ నడిచారు. ఉగ్రదాడిలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. మృతులకు ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.