GHMC Council Meeting: జీహెచ్ఎంసీ సమావేశం ప్రారంభమైన తొలి రోజే తీవ్ర వివాదం చోటుచేసుకుంది. బీజేపీ (BJP), ఎంఐఎం (MIM) కార్పోరేటర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కౌన్సిల్ సమావేశం ప్రారంభం సందర్భంగా సభలో వందేమాతరం, జయ జయహే తెలంగాణ గీతాలాపన నిర్వహించారు. ఈ సమయంలో కొందరు మజ్లిస్ పార్టీ కార్పొరేటర్లు కుర్చీలో నుంచి లేవకపోవడం పట్ల బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశంలో ఉండాలంటే వందేమాతరం పాడాల్సిందేనని తెగేసి చెప్పారు. ఈ నేపథ్యంలో మజ్లిస్ – బీజేపీ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ ఇరు పక్షాల వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
నవీన్ యాదవ్ తొలి ప్రసంగం..
ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికల కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ (Naveen Yadav) ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఉపఎన్నిక తర్వాత జరుగుతున్న తొలి కౌన్సిల్ సమావేశం కావడంతో ఆయన ఎమ్మెల్యేగా సభలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా తన తొలి ప్రసంగం చేశారు. జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే దివంగత మాగంటి గోపినాథ్ మృతి పట్ల కౌన్సిల్ వేదికగా ఆయన సంతాపం తెలియజేశారు. అలాగే అందెశ్రీ మరణం పట్ల కూడా దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ నగర అభివృద్ధి కోసం కౌన్సిల్ లో సభ్యులందరితో కలిసి తాను కూడా కృషి చేస్తానని ఈ సందర్భంగా నవీన్ యాదవ్ హామీ ఇచ్చారు.
GHMC కౌన్సిల్ సమావేశంలో రసాభాస
వందేమాతరం, జాతీయ గీతాలాపన సమయంలో కుర్చీలో నుంచి లేవని మజ్లిస్ కార్పొరేటర్లు
మజ్లిస్ కార్పొరేటర్లు లేవకపోవడాన్ని తప్పుబట్టిన బీజేపీ
దీంతో బీజేపీ, మజ్లిస్ మధ్య కాసేపు వాగ్వాదం pic.twitter.com/yB0ImNe3V9
— BIG TV Breaking News (@bigtvtelugu) November 25, 2025
GHMC కౌన్సిల్ సమావేశంలో తొలి ప్రసంగం చేసిన జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్
మాగంటి, అందెశ్రీ, కార్పొరేటర్ల మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన నవీన్ యాదవ్ pic.twitter.com/r3aFys7AzM
— BIG TV Breaking News (@bigtvtelugu) November 25, 2025
ఫ్లకార్డుల ప్రదర్శన
జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి ముందు కూడా విపక్ష బీఆర్ఎస్ (BRS), బీజేపీ పార్టీలు తమ నిరసనను వ్యక్తం చేశాయి. కౌన్సిల్ హాల్ లో బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఫ్లకార్డులు ప్రదర్శించారు. అయితే వాటిని మార్షల్స్ లాక్కునే ప్రయత్నం చేశారు. దీంతో కొద్దిసేపు స్వల్ప ఉద్రికత చోటుచేసుకుంది. మరోవైపు బీజేపీ కార్పొరేటర్లు వినూత్నంగా తమ నిరసనలు తెలియజేశారు. దున్నపోతుకు వినతి పత్రం అందజేసి కౌన్సిల్ సమావేశానికి రావడం ఆసక్తికరంగా మారింది.
Also Read: Ayodhya- PM Modi: అయోధ్యలో అపూర్వఘట్టం.. ధ్వజారోహణ చేసిన మోదీ.. కల సాకారమైందని వ్యాఖ్య
20 ప్రశ్నలపై చర్చలు..
జీహెచ్ఎంసీ సమావేశంలో చర్చకు పట్టుబడుతూ సభ్యుల నుంచి 95 ప్రశ్నలు వచ్చాయి. అయితే అందులో 20 ప్రశ్నలపై చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10తో ప్రస్తుత కౌన్సిల్ పదవి కాలం ముగియనుంది. కాబట్టి ప్రస్తుత కౌన్సిల్ కు ఇదే చివరి సమావేశం అయ్యే అవకాశముంది. కౌన్సిల్ ఏర్పాటైన ఐదేళ్లలో జరిగిన అభివృద్ధికి సంబంధించి ఈ సమావేశాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
