Ayodhya- PM Modi: అయోధ్యలో ధ్వజారోహణ చేసిన మోదీ
Ayodhya- PM Modi (Image Source: Twitter)
జాతీయం

Ayodhya- PM Modi: అయోధ్యలో అపూర్వఘట్టం.. ధ్వజారోహణ చేసిన మోదీ.. కల సాకారమైందని వ్యాఖ్య

Ayodhya- PM Modi: ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఆలయంలో ద్వాజారోహణ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. రామాలయంలోని 197 అడుగుల ఎత్తైన గర్భగుడి శిఖరంపై ప్రధాని మోదీ కాషాయ జెండాను ఎగురవేశారు. ఉదయం 11.50 నిమిషాలకు ఈ జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ ప్రక్రియతో ఆయోధ్య ఆలయ నిర్మాణం సంపూర్ణమైంది. కాగా ఈ ద్వాజారోహణ కార్యక్రమంలో ప్రధాని మోదీ (PM Modi)తో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagavath), యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ (Yogi Adithyanath), పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.

Also Read: Dharmendra Death: బాలీవుడ్ సినీ దిగ్గజం ధర్మేంద్ర మృతితో షోలే రోజులు గుర్తుచేసుకున్న అమితాబ్.. పోస్ట్ వైరల్..

ద్వాజారోహణ అనంతరం ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ సంపూర్ణ భారతం, సంపూర్ణ విశ్వం రామమయంగా మారిపోయిందని పేర్కొన్నారు. ప్రతీ రామ భక్తుడి హృదయం సంతృప్తితో నిండిపోయిందని పేర్కొన్నారు. గత వందేళ్లుగా అనుభవించిన బాధ ఇప్పుడు తీరిందని మోదీ అన్నారు. వందల ఏళ్ల నాటి సంకల్పం ఇవాళ సాకారమైందని పేర్కొన్నారు. అయోధ్య రామమందిర వివాదం 500 ఏళ్ల పాటు సుదీర్ఘంగా సాగిందన్న ప్రధాని.. నేటి భక్త ధర్మ జెండాతో మనందరి కల నెరవేరిందని మోదీ సంతోషం వ్యక్తం చేశారు.

ఇవాళ ఆవిష్కరించిన ధర్మ ధ్వజం కేవలం ఒక జెండా మాత్రమే కాదని ప్రధాని మోదీ అన్నారు. ఇది భారతీయ నాగకరితకు పునరుజ్జీవన జెండా అని పేర్కొన్నారు. జెండాకి ఉన్న కాషాయరంగు, సూర్యవంశ చిహ్నం, ఓం పదం, దేవదర వృక్షం.. రాజరాజ్య వైభవాన్ని ప్రతిబింబిస్తాయని ప్రధాని అన్నారు. ఈ జెండా.. సంకల్పం, విజయం, 100 ఏళ్ల పోరాటానికి భౌతిక రూపమని చెప్పుకొచ్చారు. అంతేకాదు శ్రీరాముడి విలువలకు సైతం ఈ జెండా ప్రతీక అని మోదీ స్పష్టం చేశారు.

అంతకుముందు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సైతం మాట్లాడారు. రామాలయంలో ఎగురవేసిన కాషాయజెండా నూతన యుగం ప్రారంభానికి సూచిక అని పేర్కొన్నారు. ఇది కేవలం యజ్ఞం ద్వారా చేసి పూర్ణాహుతి కాదన్న యోగి.. 140 కోట్ల భారతీయుల విశ్వాసానికి చిహ్నమని అన్నారు. మరోవైపు రామ జన్మభూమి కోసం జరిగిన సుదీర్ఘ పోరాటాన్ని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

ధర్మ ద్వజం విషయానికి వస్తే ఇది మూడు పవిత్ర చిహ్నాలను కలిగి ఉంది. కాషాయ జెండాలోని ఓం, సూర్యుడు, కోవిదర వృక్షం చిహ్నాలు.. భారతీయ సనాతన ధర్మంలో పాతుకుపోయిన లోతైన ఆధ్యాత్మిక విలువలకు అద్దం పడుతున్నాయి. లంబకోణ త్రిభుజాకారంలో రూపొందిన ఈ జెండా.. 10 అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పు కలిగి ఉంది. ధ్వజారోహణ కార్యక్రమం రాముడు – సీత వివాహ పంచమి ముహూర్తంతో సమానంగా జరిగింది ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది.

Also Read: Ethiopia Volcano: 12,000 ఏళ్ళ తర్వాత ఇథియోపియా అగ్ని పర్వతం పేలడంతో ఢిల్లీలో విషపూరిత వాతావరణం

Just In

01

Peddi: ‘పెద్ది’ ఈ ఫొటో ఎక్కడిది? సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న పిక్!

PuriSethupathi: పూరిసేతుపతి మూవీ టైటిల్, ఫస్ట్ లుక్‌కి.. ఎట్టకేలకు మోక్షం!

Anil Ravipudi: శంకర్ వరప్రసాద్ గారి కోసం నయన్‌కు ‘దృశ్యం’ కథ చెప్పిన అనిల్ రావిపూడి!

Ashika Ranganath: రష్మిక, శ్రీలీల అవుట్.. ఆషికాకు టాలీవుడ్ ఫిదా!

Rahul Sipligunj: ట్రెండింగ్‌లో ‘అమీర్ లోగ్’.. ‘అవ్వల్ దావత్’ సాంగ్..