హైదరాబాద్

Charminar Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు ఎక్స్ గ్రేషియా!

Charminar Fire Accident: గుల్జార్గ్ హౌస్ లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్​ రెడ్డి విచారణకు ఆదేశించారు. ఈ ప్రమాదానికి దారి తీసిన అసలైన కారణాలను లోతుగా దర్యాప్తు చేయాలని ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా నివారణ చర్యలను చేపట్టాలని, ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

మంటల్లో చిక్కుకున్న వారిలో 17 మంది మృతి చెందడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన వారికి సంతాపం ప్రకటించారు. వారి కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.

బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ప్రమాదం సమాచారం తెలిసిన వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి అగ్నిమాపక శాఖ, పోలీసు అధికారులతో ఎప్పటికప్పుడు ఫోన్​లో మాట్లాడి సహాయక చర్యలను పర్యవేక్షించారు.

Also read: Balayya and Mansion House: బాలయ్యని అలా అపార్థం చేసుకోకండి.. పూర్తిగా చూడండయ్యా!

సహాయక చర్యలను వేగవంతం చేయటంతో పాటు బాధితులకు మెరుగైన వైద్య సాయం అందించేందుకు అందుబాటులో ఉన్న మంత్రులు, అధికారులు వెంటనే ఘటన స్థలానికి వెళ్లాలని సీఎం ఆదేశించారు.

ఇక ఫైర్​ సిబ్బంది సకాలంలో స్పందించటంతో భారీ ప్రాణనష్టం తప్పిందని, అగ్నిమాపక సిబ్బంది దాదాపు 40 మందిని ప్రాణాపాయ స్థితి నుండి సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారని ముఖ్యమంత్రి అన్నారు. మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఫైర్​ టీమ్​ తమ శక్తి యుక్తులు ప్రదర్శించిందన్నారు.

 

 

Just In

01

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?