Chandanagar Fire Accident( image credit: swetcha reporter)
హైదరాబాద్

Chandanagar Fire Accident: చందానగర్ లో అగ్ని ప్రమాదం.. ఫైర్ సేఫ్టీ లేకపోవడం వల్ల జరిగిన నష్టం!

Chandanagar Fire Accident: చందానగర్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో రెండు షాపింగ్ భవనాలు పూర్తిగా అగ్నికి ఆహుతవ్వగా, పక్కనే ఉన్న హాస్పిటల్ పాక్షికంగా దగ్ధమైంది. అగ్ని ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. చందానగర్ సర్కిల్ – 21 పరిధిలోని చందానగర్ లో ఉన్న సెంట్రో ఫుట్వేర్ షాపింగ్ భవనం నేమ్ బోర్డ్ లో  సాయంత్రం తలెత్తిన షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలోనే మంటలు భవనంలోకి చేరడంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే బయటికి పరుగులు తీశారు.

అగ్ని ప్రమాదానికి సంబంధించిన సమాచారాన్ని పోలీస్, ఫైర్ అధికారులకు అందజేశారు. సెంట్రల్ భారీ మొత్తంలో ఫుట్వేర్ నిల్వలు ఉండడంతో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతూ, పక్కనే ఉన్న ఆర్కే సిల్క్స్ షాపింగ్ మాల్ కు సైతం అంటుకున్నాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతూ సెంట్రో, ఆర్కే సిల్క్స్ భవనాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. మంటలు అంతకంతకు పెరుగుతుండడంతో సెంట్రో భవనానికి మరో పక్కన ఉన్న ఉంబు ఫర్టిలిటీ దవాఖానకు అంటుకున్నాయి.

అప్పటికే ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసేందుకు చేస్తున్న ప్రయత్నంలో దవాఖాన బయట వైపు ఉన్న ఏసీలు, ఇతర సామాగ్రి పాక్షికంగా దగ్ధమయ్యాయి. మంటలు చెలరేగుతున్న సమయంలోనే అప్రమత్తమైన హాస్పిటల్ యాజమాన్యం అందులో ఉన్న రోగులను, సిబ్బందిని బయటికి తరలించారు. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.

 Also Read: Shamshabad: ఎయిర్‌పోర్టుకు బెదిరింపులు.. మిస్ వరల్డ్ పోటీలు జరిగేనా?

రెండోసారి సెంట్రో భవనం లో అగ్నిప్రమాదం..
చందానగర్లోని సెంట్రో భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం రెండవసారి. గతంలో సైతం భారీ ఎత్తున అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో భవనం పూర్తిగా దగ్ధమైంది. భవనం స్లాబ్స్ తో పాటు పిల్లర్లు సైతం బలహీన పడినట్లు అధికారులు వెల్లడించినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. జిహెచ్ఎంసి, టౌన్ ప్లానింగ్, ఫైర్ అధికారులను మేనేజ్ చేసి అదే బిల్డింగ్ను పునరుద్ధరించి మరోసారి సెంట్రో ఫుట్వేర్ షాప్ నే కొనసాగించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల సైతం చూసి చూడనట్టుగా వ్యవహరించడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఆరోపిస్తున్నారు. సెంట్రో లో చెలరేగిన మంటల కారణంగా పక్కనే ఉన్న ఆర్కే సిల్క్స్ పూర్తిగా కాలిపోయిందని, మరో పక్కన ఉన్న హాస్పిటల్ పాక్షికంగా మంటలు వ్యాపించడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

ఆలస్యంగా చేరుకున్న ఫైర్ ఇంజన్లు…
హైవేపై ఉన్న భారీ భవనంలో పెద్ద ఎత్తున మంటలు వ్యాప్తి చెంది, పక్కనే ఉన్న మరో భవనాలకు సైతం అంటుకుంటున్న.. ఫైర్ ఇంజన్లు మాత్రం ఆలస్యంగా వచ్చాయి. వచ్చిన వాటిలో సరిపడా నీళ్లు లేకపోవడంతో మంటలను అదుపు చేయడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. జిహెచ్ఎంసి ట్యాంకర్ల ద్వారా మంచినీటిని తెప్పించి ఫైర్ ఇంజన్లు ద్వారా మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఆలస్యంగా చేరుకున్న బాహుబలి ఫైర్ ఇంజన్ (బ్రాంటో లిఫ్ట్), పదుల సంఖ్యలో ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో భారీ ఎత్తున ఆస్తి నష్టం సంభవించినట్లు ఫైర్ అధికారులు పేర్కొన్నారు.

 Also Read: Ind Pak Warఫ ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడిన వారిపై నిఘా..​ రంగంలోకి ఇంటెలిజెన్స్ వర్గాలు!

భారీగా ట్రాఫిక్ జామ్…
చందానగర్ ప్రధాన రహదారిపై శుక్రవారం చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంతో రహదారిపై భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కనీసం ఫైరింజన్లు ఘటన స్థలానికి చేరుకునే వీలు లేకుండా వాహనాలు కిలోమీటర్ మేరా నిలిచిపోయాయి. ప్రజల సైతం పెద్ద సంఖ్యలో గుమిగోడడంతో పోలీసులు లాటి ఛార్జ్ చేసి అక్కడి నుంచి వెళ్లగొట్టారు.

షాపింగ్ మాల్స్ లో సైతం ఫైర్ సేఫ్టీ జీరో…
హైవేపై ఉన్న షాపింగ్ మాల్ లలో సైతం ఫైర్ సేఫ్టీ లేకపోవడంతో అధికారులు అవాక్కయ్యారు. నామమాత్రంగానే ఫైర్ పైపులను బిగించి ఉంచారని, ప్రమాదం జరుగుతుంటే ఫైర్ సేఫ్టీ ఆన్ అవ్వకపోవడంపై అనుమానంతో ప్రశ్నించగా నామమాత్రంగానే ఉన్నాయని బదులిచ్చారు. అగ్ని ప్రమాదం జరిగిన అన్ని భవనాలలో ఫైర్ సేఫ్టీ ఉంటే ఇంత మొత్తంలో నష్టం జరిగి ఉండేది కాదని ఫైర్ అధికారులతో పాటు స్థానికులు వాపోతున్నారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్