Hyderabad: అమీర్‌పేట్‌లోని మైత్రీవనం వద్ద ఉన్న శివమ్ టెక్నాలజీస్ కోచింగ్ సెంటర్‌లో అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికులు గమనించి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో, అగ్ని మాపక దళం అక్కడికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నాలు కొనసాగిస్తోంది. భవనంలో ఉన్న విద్యార్థులను సురక్షితంగా బయటకు తరలిస్తూ, ఎవరూ ప్రమాదంలో చిక్కుకోకుండా చర్యలు చేపట్టారు.
ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం, సెంటర్‌లోని కొన్ని బ్యాటరీలు పేలడం వల్ల మంటలు ఒక్కసారిగా వ్యాపించినట్లు తెలుస్తోంది. అయితే ఈ అగ్ని ప్రమాదానికి గల నిజమైన కారణం ఏమిటో ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఫైర్ అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించి, ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.

