Sarpanch Elections: పల్లెలో కాక రేపుతున్న పంచాయతీ రాజకీయం
Sarpanch Elections (imagecredit:twitter)
Telangana News

Sarpanch Elections: పల్లెలో కాక రేపుతున్న పంచాయతీ ఎన్నికల రాజకీయం.. జోరుగా పందేలు పోటాపోటీగా తాయిలాలు?

Sarpanch Elections: పల్లెల్లో పంచాయతీ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా సాగుతుంది. నువ్వా.. నేనా అన్నట్లుగా గెలుపుకోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి గడపకు వెళ్తూ ఓటువేయాలని అభ్యర్థిస్తున్నారు. అంతేకాదు ఒట్లు వేయించుకుంటున్నారు. గెలిపిస్తే సేవకుడిగా పనిచేస్తానని హామీలు ఇస్తున్నారు. కొంతమంది అభ్యర్థులు బాండుపేపర్లపై చేసే పనులను వివరించారు. ఇది ఇలా ఉంటే తొలి విడుత ప్రచారం ముగియగా, రెండు, మూడో విడుత ఎన్నికల ప్రచారం సైతం ఊపందుకుంది. అయితే పోటీచేస్తున్న అభ్యర్థులు గెలుపుకోసం పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. ఒక్కో గ్రామంలో ప్రధానపార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్ గా బరిలో నిలిచారు. వారు సైతం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.

ఓన్లీ సర్పంచ్ అభ్యర్థులే

అయితే పల్లెల్లో పంచాయతీ ఎన్నికలను పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీంతో గ్రామాల్లో ఎవరు గెలుస్తారనే దానిపై విస్తృత చర్చజరుగుతుంది. చర్చేకాదు.. గెలుపుపై బెట్టింగ్ లు సైతం ఊపందుకున్నాయి. ఎవరు గెలిస్తారు? ఎందుకు గెలుస్తారు.. ఇతరులు ఎందుకు ఓడిపోతారనేదానిపై బెట్టింగ్ లు జరుగుతున్నాయి. అంతేకాదు ఎన్ని ఓట్లతో గెలుస్తారు అనే దానిపై పందేలు జోరుగా సాగుతున్నాయి. యువత ఎక్కువగా బెట్టింగ్ లకు పాల్పడుతున్నట్లు సమాచారం. వేలల్లో బెట్టింగ్ లు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఓన్లీ సర్పంచ్ అభ్యర్థులే కాదు.. వార్డు సభ్యులపైనా బెట్టింగ్ లు జరుగుతున్నట్లు సమాచారం. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి ఎన్నికల్లో గెలిచేందుకు అభ్యర్థులు ప్రయత్నాలు చేయడం, కొంతమంది సర్పంచ్ కలను నెరవేర్చుకోవాలని, మరికొందరు రాకరాక రిజర్వేషన్లు రావడంతో గెలిచి తీరాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. దీంతో ఎంత ఖర్చు అయిన సరే పెట్టి గెలిచే ప్రయత్నాలు చేస్తుండటంతో అదే స్థాయిలో ఎవరు విజయం సాధిస్తారనే అంశంపైనా అదే స్థాయిలో బెట్టింగ్ లు జరుగుతున్నాయి.

Also Read: CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి‌ని కలిసిన టాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులు..

మరోవైపు కులాల వారీగా..

పోటీ తీవ్రంగా ఉండటంతో అభ్యర్థులు సైతం ఎదుటి వ్యక్తి ఓటుకు ఎంత ఇస్తున్నారు? అసలు ఇస్తున్నాడా లేదా? ఇస్తే మనం ఎంత ఇవ్వాలని ఆరా తీస్తున్నారు. అతడి కంటే ఎక్కువగా ఇచ్చే ప్రయత్నాలు సైతం మొదలు పెట్టినట్లు సమాచారం. అంతేకాదు మందు.. విందులు సైతం ఇస్తూ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు.. మరోవైపు కులాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ వారి ఓట్లు గంపగుత్తుగా పడేలా ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేగాకుండా తటస్థ ఓటర్లపైనా ప్రత్యేకంగా దృష్టిసారించారు. తొలి విడుత ప్రచారం ముగియడంతో పంపకాలపైనే ప్రత్యేక దృష్టిసారించినట్లు సమాచారం. అంతా సైలెంట్ గా పనికానిచ్చేస్తున్నారు.

రాష్ట్రంలో 11వేల కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు మూడు విడుతలుగా జరుగుతున్నాయి. మొత్తం 12723 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇందులో 11వేల గ్రామపంచాయతీలు సమస్యాత్మకమైనవిగా అధికారులు గుర్తించారు. పోలింగ్ రోజూ అక్కడ ఎలాంటి ఇబ్బందులు జరుగకుండా వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నారు. తొలి విడుతలో సుమారు 3600 గ్రామపంచాతీలు ఉండగా, రెండో విడుతలతో 3720, మూడో విడుతలో 3603 గ్రామపంచాయతీలు ఉన్నట్లు సమాచారం.

నిబంధనలు అతిక్రమిస్తే రెండేళ్ల జైలు

గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచార నిషేధంపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్కు 44 గంటల ముందుగా ప్రచారాన్ని నిలిపివేయాలని స్పష్టం చేసింది. ఎన్నికల ప్రచారం, బహిరంగ సభలు, టీవీ ఛానెళ్లు, రేడియో వంటి ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచార సామగ్రి ప్రదర్శన లేదా ప్లే చేయడం, సంగీత కచేరీలు లేదా నాటకాలు వంటి ఇతర వినోద కార్యక్రమాల ద్వారా ప్రచారం చేయడం నిషేధం అని రాష్ట్ర ఎన్నికల సంఘం సెక్రటరీ మకరంద్ మంగళవారం సర్క్యూలర్ జారీ చేశారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే, తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం, 2018 లోని సెక్షన్ 214 (2) ప్రకారం రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించడం జరుగుతుందని హెచ్చరించారు. పోటీ చేసే అభ్యర్థులు, ప్రచార నిర్వాహకులు, ఎలక్ట్రానిక్ మీడియా ఇన్‌ఛార్జీలు ఈ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని ఎన్నికల సంఘం కోరింది. ఈ ఆదేశాలను మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయాలని కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు సూచించారు.

Also Read: Ponnam Prabhakar: రెండేళ్లలో ఆర్టీసీలో 251కోట్ల మంది మహిళలు జర్నీ.. మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం

Just In

01

KTR: పోగు బంధంతో ఫోన్ బంధం.. సిరిసిల్ల నేతన్న అద్భుత సృష్టి..!

DekhLenge Saala Released: ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి ‘దేఖ్ లెంగే సాలా’ వచ్చేసింది.. పవర్ స్టార్ స్వాగ్ పీక్స్!

Uttam Kumar Reddy: పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై కేంద్రానికి మంత్రి ఉత్తమ్ లేఖ

Bigg Boss9 Telugu: ఈ వారం ఎలిమినేషన్ గురించి క్లారిటీ ఇచ్చిన నాగార్జున.. ఒకరు కన్ఫామ్!

Sarpanch Elections: సర్పంచ్ బరిలో నిండు గర్భిణీ.. బాండ్ పేపర్ పై హామీలతో ప్రచారం..!