Ponnam Prabhakar: మహాలక్ష్మీ పథకంతో రెండేళ్లలో ఆర్టీసీలో 251కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం (Ponnam Prabhakar) చేశారు. రూ.8459కోట్ల ప్రయాణం చేశారని వెల్లడించారు. మహా లక్ష్మీ పథకం ద్వారా ఆర్టీసీ లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభమై రెండేళ్ల పూర్తి చేసుకున్న సందర్భంగా మహిళలకు, ఆర్టీసీ ఉద్యోగులకు , సిబ్బందికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. 2023 డిసెంబర్ 9న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం తెలంగాణ అక్కా చెల్లెలకు మహా లక్ష్మీ పథకం ద్వారా ఆర్టీసీ లో ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించిందన్నారు. దీంతో కుటుంబాల బంధుత్వాలు పెరగడం, దేవాలయాల సందర్శన , హాస్పిటల్ చికిత్సలు ,విద్య వ్యవస్థ మెరుగుపరచడం ,ఉపాధి అవకాశాలు మెరుగుపర్చుకుని ఇంకా అనేక రకాలుగా మహిళలు ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఉపయోగించుకుంటున్నారన్నారు.
Also Read: Ponnam Prabhakar: తెలంగాణను దేశానికే దిక్సూచి చేస్తాం.. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్!
బస్సుల్లో 14.98లక్షల మంది ప్రయాణం
ఈ పథకం రెండు సంవత్సరాలు గా విజయవంతంగా మహిళా సాధికారత కి ఉపయోగపడుతుందన్నారు. బస్సుల్లో ప్రయాణం చేయడమే కాదు. మహిళలను బస్సులకు యజమానులుగా చేసిన ప్రభుత్వంగా తెలంగాణ ప్రభుత్వం నిలుస్తుందన్నారు. 3255 పల్లె వెలుగు, 1865 ఎక్స్ ప్రెస్, 1818 సిటీ ఆర్డినరీ, 1031 సిటీ మెట్రో ఎక్స్ ప్రెస్ మొత్తం 7969 బస్సుల్లో మహాలక్ష్మీ పథకం వర్తిస్తుందన్నారు. ఈ పథకంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆలయాలకు యాత్రికుల సంఖ్య 80శాతం పెరిగిందని, ఆలయ ఆదాయం 40శాతం పెరిగిందని వెల్లడించారు. దేవాదాయశాఖకు ఆదాయం 2023లో దాదాపు 370కోట్ల నుంచి 2024లో రూ.544కోట్లకు పెరిగిందన్నారు. ప్రతి రోజూ బస్సుల్లో 14.98లక్షల మంది ప్రయాణం చేస్తున్నారన్నారు.
Also Read: Ponnam Prabhakar: నేషనల్ హెరాల్డ్ కేసులో ఏం లేదు: మంత్రి పొన్నం ప్రభాకర్

