Bomb Threat: శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరోసారి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది ఎయిర్‌పోర్టులో అణువణువూ గాలించారు. ఇటీవల ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ఉగ్రవాదులు కారు బాంబును పేల్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టయిన నిందితులను విచారించినపుడు, దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా పేలుళ్లు జరపడానికి కుట్రలు చేసినట్టుగా వెల్లడైంది.
Also Read: Bomb Threat: మీ ఇంటిలో బాంబు పెట్టాం.. త్రిషతో పాటు ప్రముఖులకు చెన్నైలో బాంబు బెదిరింపుల కలకలం!
అలర్ట్ అయిన సీఐఎస్ఎఫ్ పోలీసులు
ఈ క్రమంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆయా రాష్ట్రాలను అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇటువంటి పరిస్థితుల్లో, శనివారం తెల్లవారుజామున ఎయిర్‌పోర్టులో బాంబులు పెట్టామని, మరికొద్ది సేపట్లో అవి పేలనున్నాయంటూ శంషాబాద్ ఎయిర్‌పోర్టు వర్గాలకు మెయిల్ వచ్చింది. వెంటనే అలర్ట్ అయిన సీఐఎస్ఎఫ్ పోలీసులు, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది, పోలీసు జాగిలాలు, మెటల్ డిటెక్టర్ల సహాయంతో ఎయిర్‌పోర్టు మొత్తం తనిఖీ చేశారు. ఎక్కడా పేలుడు పదార్థాలు కనిపించకపోవడంతో అధికారులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ బాంబు బెదిరింపు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
Also Read: Bomb Threat: మీ ఇంటిలో బాంబు పెట్టాం.. త్రిషతో పాటు ప్రముఖులకు చెన్నైలో బాంబు బెదిరింపుల కలకలం!
