Bhudan Yagna Board Lands Case: భూదాన్ యజ్ఞ బోర్డ్ (Bhudan Yagna Board) పరిధిలోని భూములు అన్యాక్రాంతమైన సంగతి తెలిసిందే. దీనిపై కొంతకాలంగా విచారణ జరుగుతోంది. ఈ క్రమంలోనే భూ అక్రమాలకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. భూదాన్ యజ్ఞ బోర్డ్ భూములకు సంబంధించి ల్యాండ్ డీలర్ గా ఆరోపణలు ఎదుర్కొంటున్న షఫ్రాన్ అనే వ్యక్తి ఇంట్లో తాజాగా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.
హైదరాబాద్ యుకుపుత్రలోని షఫ్రాన్ నివాసానికి వెళ్లిన ఈడీ అధికారులు.. ల్యాండ్ అక్రమ లావా దేవీల గురించి ఆరా తీస్తున్నారు. సంబంధిత పత్రాల కోసం తనిఖీలు చేస్తున్నారు. భూదాన్ యజ్ఞ బోర్డ్ కు సంబంధించిన దాదాపు 100 ఎకరాల భూమిని ల్యాండ్ డీలర్ షఫ్రాన్ విక్రయించినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో రంగంలోకి ఈడీ.. నిజా నిజాలు తేల్చేందుకు సోదాలు చేపట్టింది. అయితే ఆ భూములను కొనుగోలు చేసిన వారిలో ఎక్కువ మంది ఐఏఎస్ (IAS), ఐపీఎస్ (IPS) అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: Gold Rate Today : మహిళలకు గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్
ఏపీ భూదాన్ అండ్ గ్రామదాన్ చట్టం–1965 ప్రకారం 2012లో ఏపీ భూదాన్ యజ్ఞ బోర్డు ఏర్పాటు అయ్యింది. చైర్మన్‌గా జి.రాజేందర్‌రెడ్డి (G. Rajender Reddy), సభ్యుడిగా సుబ్రమణ్యంతోపాటు మరికొందరిని నాలుగేళ్ల కాలపరిమితితో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం నియమించింది. అయితే పదవీకాలంలో ఉండగా బోర్డ్ ఛైర్మన్ తో పాటు సభ్యులు అనేక భూ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనర్హులకు భూములను కేటాయించడంతో విలువైన భూములు అన్యాక్రాంతమైనట్లు వార్తలు వచ్చాయి.