Online Betting: బెట్టింగ్ యాప్స్ వలన ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. దీని బారిన పడిన వారు లక్షల్లో ఉన్నారు. రోజు రోజుకు ఈ ఘటనలు ఎక్కువవుతున్నాయి. ఆన్లైన్ గేమ్స్ ఆడితే ఉన్న డబ్బులను పోగొట్టుకోవడం తప్ప వచ్చేది ఏం ఉండదు. కాబట్టి, ఆన్లైన్ గేమ్స్ ఎవరు ఆడకండి.. ఒక్కసారి ఈ బెట్టింగ్ మాయలోకి వెళ్తే బయటకు రావడం చాలా కష్టం. గత కొన్ని నెలల నుంచి వీటిని ఎలా అయిన అరికట్టాలను పోలీస్ శాఖ వారు రంగంలోకి దిగి బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన వారి మీద కేసు నమోదు చేసి అరెస్టు చేస్తున్నారు.
డబ్బు ఉన్న వాళ్ళ కంటే, లేని వాళ్ళు ఈ ఆటలకు అడిక్ట్ అయి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి చెత్త ఆటలకు బానిసైతే జీవితంలో ఎప్పటికి ఎదగలేరు. ఓ వైపు ఇన్ని ఘటనలు జరుగుతున్నా కూడా క్రికెట్ బెట్టింగ్ తో డబ్బులు పోగొట్టుకుని ప్రాణాలు తీసుకుంటున్నారు. అయితే, తాజాగా సికింద్రాబాద్లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.
Also Read: Ancient vs Modern Marriage: పెళ్లి నిశ్చయం కావాలంటే.. ఇంట్లోకి తొంగి చూడాల్సిందే.. అసలెందుకంటే?
డబ్బులు పెడితే దానికి రెట్టింపు వస్తాయని ఆశపడి సికింద్రాబాద్లో ఓ యువకుడు క్రికెట్ బెట్టింగ్ వేశాడు. తీరా డబ్బు మొత్తం పోవడంతో రాజ్వీర్సింగ్ ఠాకూర్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతను సుచిత్రలోని బీహెచ్ఈఎల్ క్వార్టర్స్లో నివాసముంటున్నాడు. ఇతను ఎక్కువగా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ యాప్స్లో బెట్టింగ్ వేస్తూ ఉండేవాడని స్నేహితులు చెబుతున్నారు. పోలీసులకు సమాచారం అందివ్వగా కేసు నమోదు, దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Bird Flu in Batasingaram: ఆందోళనలో కోళ్ల ఫామ్ నిర్వాహకులు…కోట్లలో ఆస్తి.. యజమానుల ఆవేదన!
బెట్టింగ్ వేశాక ఎలాంటి సమస్యలు వస్తాయనేది యువకులకు ముందే అవగాహన ఉంటే, ఇలా డబ్బులు పెట్టి ప్రాణాలు తీసుకోకుండా ఉంటారు. నిముషాల్లోనే వేలకు వేలు పోతాయి.. ఆ తర్వాత వామ్మో .. వాయ్యో అన్నా కూడా డబ్బులు వెనక్కి రావు. చివరికి , ఆర్ధిక సమస్యలు ఎక్కువయ్యి తప్పు చేశానే అని మిమ్మల్ని ప్రతి క్షణం ఆ బాధ వెంటాడుతూనే ఉంటుంది. కొందరైతే డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఈ యువకుడిలా ఆత్మహత్య చేసుకుంటారు. కాబట్టి, ఆన్లైన్ భూతానికి దూరంగా ఉండండి.