Shamirpet SI Bribe: లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎస్సై!
Shamirpet SI Bribe(image credit:X)
హైదరాబాద్

Shamirpet SI Bribe: లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎస్సై!

Shamirpet SI Bribe: శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో ఏసీబీ అధికారులు  దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా లంచం డబ్భులు తీసుకుంటుండగా ఎస్సైని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ మీడియాకు వివరించారు.

ఈ నెల 20వ తేదీన శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో ఓ చీటింగ్ కేసులో ఫిర్యాదు దారుడు, అతని కార్యకర్తను తప్పించేందుకు శామీర్ పేట్ ఎస్ఐ పరశురామ్ నాయక్ రూ.2లక్షలు లంచం డిమాండ్ చేశాడని తెలిపారు. దీంతో ఫిర్యాదు దారుడు ఈ నెల 23వ తేదీన ఏసీబీ అధికారులను ఆశ్రయించారని చెప్పారు.

Also read: Padma Bhushan NBK: పద్మభూషణుడిగా నందమూరి నటసింహం.. తోడుగా ఎవరెవరు వెళ్లారంటే?

అప్పటికే 21వ తేదీన 2 లక్షల రూపాయలు లంచం శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ పరశురామ్ కారులో ఇవ్వగా, మరో సారి ఫోన్ చేసి అదనంగా మరో 25 వేలు కావాలని డిమాండ్ చేయగా ఫిర్యాదుడు 22 వేల రూపాయలు ఇవ్వడానికి అంగీకరించాడని అన్నారు. సోమవారం మరో రూ.22 వేలు పోలీస్ స్టేషన్ లోని చెత్త బుట్టలో వేసి వెళ్ళిపోవాలని ఎస్ఐ ఫిర్యాదు దారుడుకి సూచించారని చెప్పారు.

ఎస్ఐ ఆదేశాల మేరకు ఫిర్యాదు దారుడు చెత్త బుట్టలో వేసి వెళ్లిపోగా ఏసీబీ సిటీ రేంజ్ యూనిట్ 2 అధికారులు రెడ్ హ్యాండెడ్ గా ఎస్ఐ పరశురామ్ ను పట్టుకున్నామన్నారు. దీంతో ఎస్ఐ పరశురామ్ పై కేసు నమోదు చేసి ప్రత్యేక న్యాయ మూర్తి ఎదుట హాజరు పర్చినట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగితే 1064 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా లేదా వాట్స్ అప్ నంబర్ 9440446106 సమాచారం అందించాలని ఏసీబీ అధికారులు సూచించారు.

Just In

01

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..

Sree Vishnu: శాకాహార ప్రియులందరికీ హీరో శ్రీ విష్ణు సజెషన్ ఇదే..