Padma Bhushan NBK: నందమూరి నటసింహం బాలకృష్ణ (Nandamuri Balakrishna)ను రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలోని మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన ‘పద్మ భూషణ్’ (Padma Bhushan) వరించిన విషయం తెలిసిందే. సినిమా పరిశ్రమకు అలాగే ఆయన చేస్తున్న రాజకీయ, సామాజిక సేవలను దృష్టిలో పెట్టుకుని ఏపీ ప్రభుత్వం ఆయనని ‘పద్మ భూషణ్’ అవార్డుకు నామినేట్ చేయగా.. జనవరి 25న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డ్స్ 2025లో బాలయ్యను ఆ అవార్డు వరించింది. సోమవారం పద్మ అవార్డుల వేడుక రాష్ట్రపతి భవన్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా నందమూరి బాలకృష్ణ పద్మ భూషణ్ పురస్కారాన్ని స్వీకరించారు. బాలయ్య ఈ పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read- Samantha Temple: సమంతకు గుడి కట్టి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న అభిమాని.. ఎందుకంటే?
బాలయ్యతో పాటు పద్మ భూషణ్ పురస్కారం కర్ణాటకకు చెందిన నటుడు అనంతనాగ్, గాయకుడు పంకజ్ ఉదాస్ (మరణానంతరం), నటుడు అజిత్ కుమార్, దర్శకుడు శేఖర్ కపూర్ తదితరులను వరించిన విషయం తెలిసిందే. వీరంతా పురస్కారాన్ని అందుకునేందుకు ఒక రోజు ముందే ఢిల్లీకి చేరుకున్నారు. ఇక నటసింహం బాలయ్య పద్మ భూషణ్ పురస్కారం నిమిత్తం తన ఫ్యామిలీతో కలిసి ఆదివారమే ఢిల్లీకి చేరుకున్నారు. బాలయ్యతో పాటు ఆయన భార్య వసుంధర, సోదరి నారా భువనేశ్వరి, కుమార్తెలు బ్రాహ్మణి, తేజస్విని.. అల్లుళ్లు నారా లోకేష్, శ్రీ భరత్.. కుమారుడు మోక్షజ్ఞ తేజ కూడా ఈ అవార్డుల వేడుకను వీక్షించేందుకు వెళ్లారు.

తన మామయ్య పద్మ భూషణ్ అవార్డును అందుకోబోతున్న నేపథ్యంలో అల్లుడు శ్రీ భరత్ ఢిల్లీలో ఆదివారం రాత్రి గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. ఈ పార్టీకి పలువురు రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తలు హాజరయ్యారని సమాచారం. ఈ పార్టీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈ పార్టీలో బాలయ్య నటించిన ‘ముద్దుల మావయ్య’ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఆ సినిమాను 9 సార్లు చూసినట్లుగా చెబుతూ.. అందులో ఏమేం నచ్చాయో కూడా చెబుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు సైతం పాల్గొన్నారు.
Also Read- Natural Star Nani: పవన్ కళ్యాణ్ డైలాగ్‌తో.. లాస్ట్ పంచ్ భలే ఇచ్చావులే నాని!
నందమూరి బాలకృష్ణ విషయానికి వస్తే.. ఎప్పుడో ఆయనని పద్మభూషణ్ వరించాల్సి ఉంది. ఈ విషయంలో ఇప్పటికే చాలా ఆలస్యమైందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. లెజెండ్ నందమూరి తారక రామారావు (NT Ramarao) నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బాలయ్య.. తన కంటూ ప్రత్యేక గుర్తింపును, స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నారు. ఆయన నట వారసుడిగా జానపద, సైన్స్ ఫిక్షన్, సోషియో ఫాంటసీ, సాంఘిక, పౌరాణిక, చారిత్రక జోనర్స్‌లో ఎన్నో సినిమాలలో నటించి, టాలీవుడ్ చిత్ర సీమలో 50 ఏళ్ల నట ప్రస్థానం పూర్తి చేసుకున్నారు. ఆయన 50 ఏళ్ల నట ప్రస్థానం జరుపుకుంటున్న సమయంలో ఆయనకు ఈ అవార్డు వరించడం విశేషం. మరోవైపు హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సొంతం చేసుకుని, ఈ నందమూరి బిడ్డకు, ఆ గడ్డమీద తిరుగులేదని చాటి చెబుతూ వస్తున్నారు. అలాగే బసవ తారకం ఇండో అమెరికన్ హాస్పటల్ చైర్మన్‌గా బాలయ్య సేవలు నిత్యం కొనియాడబడుతుంటాయనే విషయం తెలియంది కాదు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
