Samantha Temple
ఎంటర్‌టైన్మెంట్

Samantha Temple: సమంతకు గుడి కట్టి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న అభిమాని.. ఎందుకంటే?

Samantha Temple: స్టార్ హీరోయిన్ సమంత పేరుని పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులు ఆమె నటనను మెచ్చి, అగ్రస్థానం ఇచ్చారు. ప్రస్తుతం ఆమె టాలీవుడ్‌లో సినిమాలు చేయడం తగ్గించినా, అభిమానులు మాత్రం ఆమెను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. సమంత జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి. ఆ కష్టాలన్నింటినీ జయించి, స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన తీరు ఎందరికో స్ఫూర్తి దాయకం. ఇప్పటికీ ఆ కష్టాన్నే నమ్ముకుని, లైఫ్‌ని లీడ్ చేస్తుంది సమంత. మధ్యలో పాసింగ్ క్లౌడ్‌లా తన జీవితంలోకి పెళ్లి అనే బంధం వచ్చినా, అది ఎంతకాలమో నిలబడలేదు. అప్పటి నుంచి సమంత ఏదో ఒక విధంగా నిత్యం వార్తలలో హైలెట్ అవుతూనే ఉంది.

Also Read- Tollywood: ఏ హీరో సినిమా ఎక్కడ షూటింగ్ జరుపుకుంటుందో తెలుసా?

సమంతను కొన్నాళ్లుగా వేధిస్తున్న సమస్య మయోసైటీస్. ఈ వ్యాధిని జయించేందుకు ఆమె తీవ్రంగా కృషి చేస్తుంది. చికిత్స నిమిత్తం అమెరికా కూడా వెళ్లి వచ్చింది. అయినా కూడా ఇప్పటికీ ఆమె సెలైన్ పెట్టుకుని కనిపిస్తూనే ఉంది. ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటుంది. అయినా కూడా ఆమెపై ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది. వాటిని పట్టించుకోకుండా, తన పని ఏదో తను చేసుకుంటూ వెళ్లిపోతుంది సమంత. ప్రస్తుతం ఆమె నిర్మించిన ‘శుభం’ సినిమా ప్రమోషన్లలో బిజీబిజీగా ఉంది. ఆమె పుట్టినరోజు (ఏప్రిల్ 28)ను పురస్కరించుకుని ఈ చిత్ర ట్రైలర్‌ని ఒక రోజు ముందే విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ట్రైలర్ ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది.

ఇదిలా ఉంటే మూడేళ్ల క్రితం సమంత కోసం ఓ అభిమాని గుడి (Samantha Temple) కట్టించిన విషయం తెలియంది కాదు. ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా, ఆలపాడుకు చెందిన తెనాలి సందీప్.. ఆమెకు గుడి కట్టడమే కాకుండా, ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నారు. మూడేళ్లుగా సమంత పుట్టినరోజున ఆయన ప్రత్యేక కార్యక్రమాలను చేస్తూ వస్తున్నారు. ఈ పుట్టినరోజుకు కూడా సమంత బర్త్‌డేను ఆయన గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. పెద్ద కేక్ కట్ చేయించి, పీజీఎమ్ హోమ్ చిల్డ్రన్‌ సంస్థకు చెందిన అనాథ పిల్లలకు కడుపు నిండా రుచికరమైన భోజనాన్ని ఆయన అందించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మాధ్యమాలలో బాగా వైరల్ అవుతుంది.

Also Read- Natural Star Nani: పవన్ కళ్యాణ్ డైలాగ్‌తో.. లాస్ట్ పంచ్ భలే ఇచ్చావులే నాని!

ఈ వీడియోలో తెనాలి సందీప్ (Tenali Sandeep) మాట్లాడుతూ.. ‘‘నేను సమంతకు వీరాభిమానిని. గత మూడు సంవత్సరాల నుంచి ఆమె పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తూ ఉన్నాను. ఈ టెంపుల్ కట్టి కూడా మూడు సంవత్సరాలు అవుతుంది. ప్రతి సంవత్సరం ఆమె పుట్టినరోజు సందర్భంగా పిల్లలకు అన్నదానం, కేక్ కటింగ్స్ జరుపుతుంటాం. ఈ సంవత్సరం కూడా అదే చేశాం. ఆమె పేదలకు చేసే సహాయం నచ్చి, నేను ఈ విధంగా చేస్తున్నాను. ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా ఎందరికో ఆమె సహాయం చేస్తున్నారు. లక్షల రూపాయలు పెట్టి హాస్పిటల్‌లో చూపించుకునే స్థోమత లేని మాలాంటి వారెందరికో ఆమె అండగా ఉన్నారు. మాలాంటి వారందరి ఆశీస్సులతో ఆమె నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను..’’ అని చెప్పారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ