Tollwood: టాలీవుడ్ హీరోలందరూ ప్రస్తుతం షూటింగ్స్‌తో బిజీ బిజీగా ఉన్నారు. ఇందులో ఎక్కువగా హైదరాబాద్‌లో వేసిన సెట్స్‌లోనే షూటింగ్‌లో పాల్గొంటున్నారు. హైదరాబాద్‌లోని అనేక ఏరియాల్లో జరుగుతున్న ఈ షూటింగ్స్ వివరాల్లోకి వస్తే..
SSMB29: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న SSMB29 చిత్రం జనవాడలో వేసిన సెట్‌లో జరుగుతుంది. రాజమౌళి కొన్ని కీలక సన్నివేశాలను ఈ సెట్‌లో షూట్ చేస్తున్నారు. ఆదివారం నేచురల్ స్టార్ నాని సినిమా ‘హిట్: ది థర్డ్ కేస్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రాజమౌళి ముఖ్య అతిథిగా పాల్గొన్న విషయం తెలిసిందే.
Also Read- Natural Star Nani: పవన్ కళ్యాణ్ డైలాగ్‌తో.. లాస్ట్ పంచ్ భలే ఇచ్చావులే నాని!
‘మాస్ జాతర’: మాస్ మహారాజా రవితేజ హీరోగా భాను భోగవరపు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘మాస్ జాతర’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం ముచ్చింతల్‌లో షూటింగ్ జరుపుకుంటోంది.
NC24: యువసామ్రాట్ నాగ చైతన్య ‘తండేల్’ తర్వాత ‘విరూపాక్ష’ దర్శకుడితో మైథికల్ థ్రిల్లర్ జానర్‌లో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర LLP (SVCC), సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై BVSN ప్రసాద్, సుకుమార్ నిర్మిస్తుండగా, బాపినీడు సమర్పిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ 7 ఏకర్స్‌లో జరుగుతోంది.
VT15: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్, అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరుపుకుంటోంది.
సంబరాల యేటిగట్టు (SYG): సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ హీరోగా, నూతన దర్శకుడు రోహిత్ కెపి రూపొందిస్తున్న ‘సంబరాల యేటిగట్టు (SYG)’ చిత్రం తుక్కుగూడలో షూటింగ్ జరుపుకుంటోంది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ‘హనుమాన్’ చిత్ర నిర్మాతలు కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Also Read- SS Rajamouli: హిట్ మెషిన్ అని రాజమౌళి ఎవరిని పిలుస్తారో తెలుసా?
Mirai: యంగ్ హీరో తేజ సజ్జా సూపర్ యోధ పాత్రలో నటిస్తున్న పాన్-ఇండియా యాక్షన్-అడ్వెంచర్ చిత్రం ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శంషాబాద్‌లో జరుగుతుంది.
‘తెలుసు కదా’: స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ అప్ కమింగ్ రొమాంటిక్ డ్రామా చిత్రం ‘తెలుసు కదా’. స్టైలిస్ట్ నీరజా కోన దర్శకురాలిగా పరిచయమవుతోన్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, టిజి కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. బాచుపల్లిలో వేసిన భారీ సెట్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.
లెనిన్(Lenin): అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న అక్కినేని అఖిల్ చిత్రం ‘లెనిన్’. ‘వినరో భాగ్యము విష్ణు కథ’ చిత్రంతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న మురళీకిశోర్ అబ్బూరు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ముచ్చింతల్‌లో జరుగుతుంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు