Cockroaches in Dosa : షాద్ నగర్ పట్టణ సమీపంలో ఉన్న రాఘవేంద్ర ఉడిపి హోటల్లో యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి కొట్టొచ్చినట్టుగా కనబడుతోంది. తిను పదార్థాల తయారీలో హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ఆదివారం ఓ వినియోగదారుడు టిఫిన్ చేసేందుకు రాఘవేంద్ర ఉడిపి హోటల్ కి వచ్చి దోశ ఆర్డర్ చేశాడు. దోశ తింటూ ఉండగా.. అందులో బొద్దింక ప్రత్యక్షమైంది. దీంతో కంగుతిన్న వినియోగదారుడు యాజమాన్యాన్ని సిబ్బందిని ప్రశ్నించగా చేతులు తడుముకున్నారు. ఇదే హోటల్ లో గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. అపరిశుభ్రత వాతావరణం లో వంటకాలు వండటం వల్లే బొద్దింకలు, ఈగలు భోజన పదార్థాలలో ప్రత్యక్షమవుతున్నాయి.
Also Read: Naga Chaitanya: మామ లవర్ తో నాగచైతన్య బోల్డ్ రొమాన్స్.. ఘాటు సీన్స్ తో కుర్రకారుకు మతి పోవడం పక్కా!
ఫుడ్ ఇన్స్పెక్టర్ల తనిఖీలపై నిర్లక్ష్యం ఎందుకు?
హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల పర్యవేక్షణ ఉండడం లేదు. నాణ్యత ప్రమాణాలు పాటించని హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మామూళ్ల మత్తులో చర్యలకు సైతం పూనుకోవడం లేదు. గతంలో ఇక్కడి హోటల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నప్పటికీ అధికారులు చేపట్టిన చర్యలు శూన్యం. తాజాగా రాఘవేంద్ర హోటల్ లో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన పై సంబంధిత అధికార యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో? చూడాలి.
Also Read: TDP MLA: రాత్రిపూట మహిళా ఎమ్మార్వోకు టీడీపీ ఎమ్మెల్యే ఫోన్.. పచ్చి బూతులు.. సీఎం ఏం చేస్తున్నట్లు?