Ganja Seized: స్పెషల్ డ్రైవ్ లో భాగంగా స్టేట్ ఎక్సయిజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసి 3.455 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎక్సయిజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఉప్పల్ లో నివాసముంటున్న సతీష్ అనే వ్యక్తి వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్. అయితే, తేలికగా డబ్బు సంపాదించేందుకు తన స్వస్థలమైన ఈస్ట్ గోదావరికి తరచూ వెళుతూ గంజాయి కొని తెచ్చి ఇక్కడ అమ్ముతున్నాడు.
Also Read: Crime News: నకిలీ పత్రాలు సృష్టిస్తున్న గ్యాంగ్ అరెస్ట్.. అక్రమాలకు తెరలేపిన జంట?
ఈ మేరకు సమాచారం అందటంతో సీఐ నాగరాజు, ఎస్సై జ్యోతితోపాటు సిబ్బందితో కలిసి అతన్ని అరెస్ట్ చేశారు. నిందితుని నుంచి 1.800 కిలోల గంజాయిని సీజ్ చేశారు. సీఐ సుభాష్ చందర్, ఎస్సై వెంకటేశ్వర్లుతో కలిసి హయత్ నగర్, వనస్థలిపురం ప్రాంతాల్లో గంజాయి అమ్ముతున్న ముత్యాల తిరుమలేష్ ను అరెస్ట్ చేసి 1.335 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దాంతోపాటు బొంగులూరులో గంజాయి విక్రయిస్తున్న వెంకటేశ్ ను అరెస్ట్ చేసి 320 గ్రాముల గంజాయి సీజ్ చేశారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు