Crime News( imsge credit: swetcha reporter)
క్రైమ్

Crime News: నకిలీ పత్రాలు సృష్టిస్తున్న గ్యాంగ్ అరెస్ట్.. అక్రమాలకు తెరలేపిన జంట?

Crime News: పాత తేదీలతో ఉన్న స్టాంప్ పేపర్లతో ఆస్తుల రిజిస్ట్రేషన్​ డాక్యుమెంట్లు తయారు చేసి కబ్జాదారులకు విక్రయిస్తున్న గ్యాంగ్​ సభ్యులను ఎల్బీనగర్​, మహేశ్వరం ఎస్వోటీ అధికారులు సరూర్​ నగర్​ పోలీసులతో కలిసి పట్టుకున్నారు. నిందితుల నుంచి పెద్ద సంఖ్యలో బాండ్​ పేపర్లు, నకిలీ బర్త్​, కుల, ఆదాయపు పన్ను ధృవీకరణ పత్రాలు, రబ్బరు స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీనగర్​ లోని క్యాంప్​ కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశంలో రాచకొండ కమిషనర్ సుధీర్​ బాబు వివరాలు వెల్లడించారు.

ప్రధాన నిందితులు భార్యాభర్తలు…
హయత్​ నగర్​ కుంట్లూరు వాస్తవ్యులైన తోట వెంకట భానుప్రకాశ్​ (55), తోట సాగరిక (38) దంపతులు. తొమ్మిదేళ్లుగా సరూర్​ నగర్​ మున్సిపల్​ కార్యాలయం ఎదురుగా సాత్విక్​ ఎంటర్​ ప్రైజెస్​ పేర వ్యాపారం చేస్తున్నారు. ఇందులో భాగంగా రెంటల్​ అగ్రిమెంట్లు, అఫిడవిట్లు, సేల్​ డీడ్లు తదితర డాక్యుమెంట్లు తయారు చేసేవారు. దీనికి అవసరమైన నాన్​ జ్యుడిషియల్​ స్టాంప్​ పేపర్లను పాతబస్తీలోని సిటీ సివిల్​ కోర్టుల వద్ద డాక్యుమెంట్​ రైటర్​ గా వ్యాపారం చేస్తున్న ఆసిఫ్​ నగర్​ నివాసి సయ్యద్​ ఫిరోజ్​ అలీ (34), హయత్​ నగర్ బొమ్మలగుడి ప్రాంతంలోని చెరుకూరి అపార్ట్​ మెంట్​ లో నివాసముంటున్న అడ్డగూడూరు చంద్రశేఖర్​ (64) నుంచి కొనేవారు.

 Also Read: Anti-Narcotics Award: ప్రపంచంలోనే నెంబర్ వన్.. పోలీసుల కిరీటంలో మరో కలికితురాయి..

డబ్బుపై ఆశతో...
అయితే, ఈ వ్యాపారంలో ఆశించినంత డబ్బు రాకపోవటంతో వెంకట భానుప్రకాశ్​ అక్రమాలకు తెర లేపాడు. ఇందులో భాగంగా సయ్యద్​ ఫిరోజ్​ అలీ చంద్రశేఖర్​ ల నుంచి పది…ఇరవై యేళ్ల క్రితం నాటి నాన్​ జ్యుడిషియల్ స్టాంప్​ పేపర్లను ఎక్కువ ధరలకు కొనటం మొదలు పెట్టాడు. ఇలా కొన్న స్టాంప్​ పేపర్లపై ఉన్న వివరాలను రిన్​ అలా, థిన్నర్​ ల సహాయంతో ఎరేజ్​ చేసేవాడు. ఆ తరువాత తన వద్దకు వచ్చే వారి నుంచి భారీ మొత్తాల్లో డబ్బు తీసుకుంటూ ఫేక్​ డాక్యుమెంట్లు తయారు చేసి ఇవ్వటం మొదలు పెట్టాడు.

నకిలీ రబ్బరు స్టాంపులు...
ఇలా నకిలీ డాక్యుమెంట్ల తయారు చేయటానికి వెంకట భానుప్రకాశ్​ నిమ్స్​ ఆస్పత్రిలో అసిస్టెంట్​ ప్రొఫెసర్​ గా పని చేస్తున్న న్యూరో సర్జన్​ డాక్టర్​ శ్రీధర్​, కింగ్​ కోఠి హాస్పిటల్​ లో ఫార్మసీ సూపర్​ వైజర్​ గా ఉద్యోగం చేస్తున్న బీ.పాండు, లైసెన్స్​ డ్​ స్టాంప్ వెండర్​ సూర్యప్రకాశ్​ రెడ్డి, అడ్వకేట్లు ఆర్​.భూపతిరెడ్డి, బీ.రవీంద్ర ప్రసాద్​ యాదవ్​, నర్సింహారావుల పేర్లతో నకిలీ రబ్బర్ స్టాంపులు తయారు చేయించి ఉపయోగించాడు. దీనికి దిల్​ సుక్​ నగర్​ నివాసి, రబ్బర్​ స్టాంప్​ మేకర్​ పత్యప్రభు సహకరించాడు.

280 ఫేక్​ డాక్యుమెంట్లు…
ఇలా గత ఒక్క సంవత్పరంలోనే 280 ఫేక్​ డాక్యుమెంట్లు తయారు చేసిన వెంకట భానుప్రకాశ్ వాటిని కబ్జాలు చేయటమే పనిగా పెట్టుకున్న వారికి విక్రయించాడు. ఈ విషయం తెలిసి బొటిక్​ షాప్​ నడుపుతున్న సరూర్​ నగర్​ నివాసి జల్లా కిషోర్ కుమార్​ తనకు ఒక ఫేక్ సేల్​ డీడ్​ తయారు చేసి ఇవ్వాలని వెంకట భానుప్రకాశ్​ ను అడిగాడు. డబ్బు తీసుకుని వెంకట భానుప్రకాశ్​ ఫేక్​ సేల్​ డీడ్​ చేసి ఇవ్వగా ఖమ్మంకు చెందిన చంచ​ల నిఖిల్​ సహాయంతో బ్యాంకు నుంచి రుణం తీసుకున్నాడు.

Aslo Read: Maheshwar Reddy on Congress: మంత్రివర్గ విస్తరణకు అడ్డుగా సీఎం.. అందుకే విభేదాలు!

ఇవే కాదు…
ఇక, వెంకట భానుప్రకాశ్ అంబర్​ పేటకు చెందిన మహ్మద్​ జలీల్​, నల్గొండ జిల్లా చందుపట్ల గ్రామానికి చెందిన పులుసు మహేశ్​ గౌడ్​ తో కలిసి నకిలీ బర్త్​ సర్టిఫికెట్లు, ఆధార్​ కార్డులు కూడా తయారు చేశాడు. దీని కోసం కామారెడ్డి మున్సిపల్​ కార్యాలయంలో ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగిగా పని చేస్తున్న ప్రవీణ్​, నార్సింగి మున్సిపాలిటీ ఆఫీస్​ లో పని చేస్తున్న దుడ్డు సుధీర్​ కుమార్​, బండ్లగూడ జాగీర్ మున్సిపల్​ ఆఫీస్​ ఉద్యోగి ముదస్సిర్​ లు అతనికి సహకరించారు.

పక్కా సమాచారంతో దాడులు...
ఈ గ్యాంగ్​ సాగిస్తున్న అక్రమాల గురించి పక్కగా సమాచారాన్ని సేకరించిన ఎల్బీనగర్​ ఎస్వోటీ అధికారులు, సరూర్​ నగర్​ పోలీసులతో కలిసి సాత్విక్​ ఎంటర్​ ప్రైజెస్​ పై దాడి చేశారు. వెంకట భానుప్రకాశ్​, సాగరిక, అడ్డగూడూరు చంద్రశేఖర్​, అడ్డగూడూరు అనిల్​, మహ్మద్​ జలీల్​, జల్లా కిశోర్​ కుమార్​ లను అరెస్ట్​ చేశారు. పరారీలో ఉన్న సయ్యద్​ ఫిరోజ్​ అలీ, పుల్లా మల్లేష్​ గౌడ్​, ప్రవీణ్​, దుడ్డు సుధీర్​ కుమార్​, ముదస్సిర్​, చంచల నిఖిల్​, సత్యప్రభుల కోసం గాలిస్తున్నారు. నిందితుల నుంచి వందల సంఖ్యలో నకిలీ డాక్యుమెంట్లతోపాటు రబ్బరు స్టాంపులు, ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. గ్యాంగ్​ సభ్యులను అరెస్ట్​ చేసిన అధికారులను కమిషనర్​ సుధీర్​ బాబు అభినందించారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు