Kavitha and Teenmaar Mallanna(image credit: twitter)
లేటెస్ట్ న్యూస్, సూపర్ ఎక్స్‌క్లూజివ్

Kavitha and Teenmaar Mallanna: ఎప్పుడూ ఏదో ఒక లొల్లి.. ప్రజా సమస్యలపై లేని సోయి?

Kavitha and Teenmaar Mallanna: రాజకీయాలు  అంటే ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను నెత్తి మీద వేసుకుని పోరాడాలి. కానీ, రాష్ట్రంలో ఇద్దరు ఎమ్మెల్సీల పరిస్థితి భిన్నంగా ఉన్నది. వారెవరూ కాదు. కల్వకుంట్ల కవిత, (Kalvakuntla Kavitha) తీన్మార్ మల్లన్న (Teenmaar Mallanna) (చింతపండు నవీన్). మల్లన్నను పార్టీ అధికారికంగా బహిష్కరించింది. కవితదీ ఇంచుమించు పరిస్థితి అంతే. పార్టీలో ఉన్నారో లేరో తెలియడం లేదన్న చర్చ ఉన్నది. వీరిద్దరూ సొంత అజెండాతో బీసీ జపం చేస్తూ పబ్బం గడిపే పయత్నం చేస్తున్నారు. ఇదంతా కేవలం వాళ్ల ఉనికి కోసం చేస్తున్న ఫైట్ అని తాజా వ్యవహారాలతో రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.


ఎవరివారే గొప్ప..

జాగృతి పేరుతో కవిత, (Kavitha)  బీసీ పార్టీ అంటూ తీన్మార్ నవీన్ ఒకే దారిలో నడుస్తున్నారు. వీళ్ల పొంతనలేని మాటలకు ఎవరూ సమాధానం చెప్పలేరేమో. అందుకే కాల్పుల దాకా వెళ్లిందని అంటున్నారు. సొంత పార్టీ విధానాలపై రెచ్చగొట్టేందుకు తనకు ఉన్న యూట్యూబ్‌‌ను మల్లన్న వాడుకుంటుంటే, రోజూ పబ్లిక్‌లో ఉండేలా సోషల్ మీడియాను వాడుకుని కవిత ఉనికిని కాపాడుకునేందుకు చూస్తున్నారు. ఇలా వీరిద్దరి తీరు అధికార, ప్రతిపక్ష పార్టీలకు కొరకరాని కొయ్యగా మారింది. పార్టీ వద్దని వదిలేసి బహిష్కరించినా, ఆ పార్టీ నేతలు ఇంకా ఇండైరెక్ట్‌గా మల్లన్నకు వత్తాసు పలుకుతున్నారు. ఇటు అన్న కేటీఆర్ ప్రేరణతో కవిత దాడులకు దిగడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.


Also ReadMLC Kavitha: తీన్మార్ మల్లన్నకు ఎమ్మెల్సీ కవిత స్ట్రాంగ్ కౌంటర్లు

డీజీపీ రావాల్సిందే?

ప్రోటోకాల్ ప్రకారం అధికారి కంటే అసెంబ్లీలో ఉండే నేతలకే మొదటి ప్రాధాన్యత. శాసన సభ్యులకు అధికారులు అంతా అన్సర్‌బుల్. ఎమ్మెల్సీ చింతపండు నవీన్ (Naveen) అలియస్ తీన్మార్ మల్లన్నపై జరిగిన దాడిపై డీజీపీ స్పందించి వెళితే సోషల్ మీడియాలో మరోలా వైరల్ చేయడం తగదు అంటున్నారు జనం. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే ఎవరినీ ఊపిక్షించొద్దు. శాసన సభ్యుడిపై దాడి జరిగితే ప్రజాస్వామ్యంపై జరిగినట్లే. అందుకు కఠిన చర్యలు తీసుకోవాలి.

యూట్యూబర్ భాష, మీటింగ్ భాషకు తేడా ఉండాలి

సోషల్ మీడియాలో భావ ప్రకటన స్వేచ్ఛ ఎంతైనా ఉంటుంది. ఈ రోజుల్లో యూట్యూబ్‌ను చూడకు అనేంత వరకు వాదనలు జరుగుతున్నాయి. అయితే, ఒక రాజకీయ పార్టీని పెడుతున్నా అంటూ మాటల సందర్భంలో మహిళలను కించపరిచేలా భార్యాభర్తలకు సంబంధం ఉండే కంచం, మంచం అనే మాటలు అభ్యంతరకరం. ఇవే దాడికి కారణమయ్యాయి. తెలంగాణలో గొల్ల కుర్మలు అంటూ వాళ్ల భాషను వాడుక భాషగా వాడి చెప్పిన వ్యవహారంపైనా వివాదం రాజుకున్నది.

ఉద్యమాలకు కులం పేరు ఏంటో?

అణగారిన వర్గాల కోసం ఏ కులం, మతం ఉండదు. అగ్రవర్ణాల వారిలో ఎంతో సంపదను కాదని అడవి బాట పట్టిన వారూ ఉన్నారు. మావోయిస్టులుగా మారి కుటుంబాలకు దూరం అయ్యారు. ఒక్క బీసీ వాళ్లే పండుగ చేసుకోవాలి. లేదా ఎస్సీ, ఎస్టీల వారి కోసం ఫైట్ చేసుకుని వారే ఉండాలి అంటే మానవ సమాజంలో తెలివి ఉన్నవారిదే పట్టం. కేవలం రాజకీయాల కోసం మాత్రమే ఇలా రాద్దాంతం చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదనే వాదన వినిపిస్తున్నది.

 Also Read: MLC Kavitha: నేను ఊరుకునే ప్రసక్తే లేదు.. ఎమ్మెల్సీ కవిత

Just In

01

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు