- నగరంలో బరి తెగించిన ఆరా మస్తాన్ గ్యాంగ్?
- ఆంధ్రా నుంచి వచ్చి హైదరాబాద్‌లో కబ్జా దందా?
- రూ.50 కోట్ల భూమిని అక్రమ సేల్ డీడ్‌తో రూ.2 కోట్లకే కొట్టేసిన వైనం?
- పొజిషన్ చేజిక్కించుకునేందుకు పోలీసులకు రూ.కోటి దాకా మామూళ్లు?
- కబ్జా జరిగిందని సీనియర్ సిటిజన్ వెళితే అప్పటికప్పుడు కారుపై చలానా వేసి సీజ్?
- 4 గంటల పాటు మెడిసిన్ ఇవ్వకుండా స్టేషన్‌లోనే ఉంచి వేధింపులు
- పొజిషన్‌లో ఉన్నవారికి 20 ఏండ్ల క్రితమే
ఒరిజినల్ సూట్‌లో తీర్పు రిజిస్ట్రేషన్ అయిన పలు డాక్యుమెంట్లు - కానీ, మాకు రిజిస్ట్రేషన్ అయింది.. రూ.3 కోట్లు ఇస్తాం అంటూ బేరసారాలు
- పొజిషన్ తమకే ఉందంటూ హైకోర్టులో మస్తాన్ టీం పిటిషన్
- నోటీసులు తీసుకుని విచారణకు సహకరించాలని షాకిచ్చిన న్యాయస్థానం
- సీటీలోని ఓ ఐపీఎస్‌కు కోటి రూపాయలతో ఏర?
- చేసిన తప్పులను ఎత్తిచూపిన మీడియాపై బురద జల్లే ప్రయత్నం?
- కల్లబొల్లి కబుర్లతో టైటిల్ ఉందని కనిపించిన వారి కల్లా మస్కా?
- అన్ని పార్టీల అండదండలు ఉన్నాయంటూ ఊదరగొట్టే ప్రయత్నం
- ఉచితంగా అధికార పార్టీకి సర్వే చేయాలి.. రూ.4 కోట్లు ఖర్చు అవుతుందని బాతాఖానీ
- అటు తనకు రిజిస్ట్రేషన్ చేసిన వారికి డబ్బులు ఇవ్వకుండా..
- ఇటు పొజిషన్ ఉన్నవారిని బెదిరించి కొట్టేసిన తీరు
- కరెంట్ తీసివేసి, సీసీ కెమెరాలు కట్ చేసి 20 మందితో మకాం
- స్వేచ్ఛ – బిగ్ టీవీ ప్రతినిధి వెళ్తే ఫోన్ లాగేసుకుని వీడియోలు డిలీట్ చేసిన మస్తాన్ గ్యాంగ్
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల
స్వేచ్ఛ ఎడిటర్
Aaraa Mastan: షేక్ మస్తాన్.. అలియస్ ఆరా మస్తాన్. పర్మినెంట్ అడ్రస్ ఆంధ్రాలోని ఉమ్మడి గుంటూరు జిల్లా చిలకలూరిపేట. కానీ, హైదరాబాద్ నడిబొడ్డున సికింద్రాబాద్ మెట్టుగూడలో కనీసం రూ.50 కోట్లు విలవ చేసే 5717 గజాల భూమిని కబ్జా పెట్టేశాడు. తనకు పొజిషన్ ఉందని పోలీసులు ఇన్వాల్ అవుతున్నారని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. గతంలో ఇదే భూమిపై కబ్జా కేసు నమోదు అయింది. ఆ కేసులో నోటీసులు తీసుకుని విచారణకు సహకరించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. తాను కోరినట్లు తీర్పు ఇవ్వకుండా పిటిషన్ క్లోజ్ చేసింది హైకోర్టు. దీంతో మరింత బరితెగించాడు.
దారులన్నీ మూసుకుపోతున్నాయని బరితెగింపు?
అన్ని పార్టీల నేతలంతా తన జేబులో ఉన్నారని చెప్పుకుంటూ, ఆ భూమిని ఎలాగైనా కాజేసేందుకు మొదటగా కబ్జాలో ఉన్న కుమార స్వామి కుటుంబంతో బేరాసారాలు ఆడింది మస్తాన్ గ్యాంగ్. రూ.3 కోట్లు ఇస్తాం తప్పుకోండి అని మీటింగులు పెట్టింది. తమకు సివిల్ సూట్‌లో పార్టీషన్ డీడ్‌లు ఉన్నాయి, రూ.13 కోట్లు ఇవ్వాలని వాళ్లు డిమాండ్ చేసినట్లు తెలిసింది. తాను అధికార పార్టీకి సర్వేలు చేయాలి, అందుకు రూ.4 కోట్లు ఖర్చు అవుతుంది, నేను ఫ్రీగానే చేస్తున్నాను, మీకు రూ.3 కోట్లే ఇస్తానని మస్తాన్ బెదిరించినట్లు సమాచారం. అది కాస్తా, ఇరు పార్టీలు కేసుల వరకు వెళ్లాయి. రూ.50 కోట్ల ప్రాపర్టీని రూ.2 కోట్లు ఖర్చు పెట్టి తీసుకున్నందుకు మరో కోటి రూపాయలు పోలీసులకు ఖర్చు చేసి తానే పొజిషన్ తీసుకుంటానని భయాందోళనకు గురిచేసినట్లు బాధితుడు రమేష్ చెప్పారు. అసలు లిటిగేషన్ ల్యాండ్‌లోకి ఎలా ఇన్వాల్వ్ అయ్యారు, తప్పులను కప్పిపుంచుకునేందుకు ఏం చేశారో, ‘స్వేచ్ఛ’ ఇన్వెస్టిగేషన్ కథనం ఇచ్చింది. తప్పులు అన్నీ పబ్లిక్‌కి తెలిసి పోయాయని మస్తాన్ తన మాయల మాటలకు పదును పెట్టాడు. కనిపించిన వారి కల్లా తానే ఫర్ఫెక్ట్ అంటూ కోర్టు ఆర్డర్స్‌ని దాచిపెట్టి ఒరిజనల్ పేపర్స్ చూపిస్తున్నాడు. బయటపెట్టిన ‘స్వేచ్ఛ’ జర్నలిస్టులపై లేనిపోని కట్టుకథలు అల్లుగుతున్నాడు. స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ నిజాలు ఎలా నిర్భయంగా రాస్తుందో చిలకలూరుపేట మస్తాన్‌కు ఇంకా పూర్తిగా తెలియకపోవచ్చు. ఫోన్ చేసి మరీ చెప్పడంతో ‘స్వేచ్ఛ’ గురించి తెలిసిన వారంతా ఎదురు ప్రశ్నించడంతో ఏదైనా ఇక బరితెగించాల్సిందే అని పోలీసుల అండదండలతో కబ్జా చేయించే ప్రయత్నం చేశారు.
Read Also- TCS layoffs 2025: టీసీఎస్ అనూహ్య ప్రకటన.. ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్
ఐపీఎస్ మీకిది తగునా?
ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయిన డీసీపీపై ప్రతి జర్నలిస్టుకి మంచి ఓపీనియన్ ఉండేది. యంగ్ ఆఫీసర్ సివిల్ కేసులో ఇన్వాల్వ్ కాకుండా చట్టప్రకారం పొజిషన్‌లో ఉంటే ఎలా ఖాళీ చేయించాలో అలా ప్రొసీడింగ్స్ ఫాలో అవుతారని అనుకున్నారు. కానీ, పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని ఒకరి వైపు వత్తాసు పలికినట్లు బలమైన ఆధారాలు ఉన్నాయి. ఈయన బ్యాచ్‌మెట్ అయిన ఐపీఎస్ ఉత్తర తెలంగాణలో పనిచేస్తున్న అధికారి నుంచి ఈ ల్యాండ్ కేసులో తెలిసిన వారని చెప్పారు. అయితే, కేసులో అవినీతి ఆరోపణలు వస్తే ఏమౌతుంది, విచారణలో తేలితే బదిలీ చేస్తారు, అంతకంటే ఏం చేయలేరు కదా అని వాఖ్యానించడం ఆశ్చర్యానికి గురిచేసిందని డిపార్ట్మెంట్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తనకు ఉన్న పొలిటికల్ పరిచయాలతో మంచి పోస్టింగులు వస్తాయిని ఆరా మస్తాన్ మస్కా వేయడంతో పాటు అనేక విధాలుగా ఆశలు చూపించడంతో పోలీసులు కబ్జా చేసేందుకు సహకరించారని ఆరోపణలు ఉన్నాయి. అందుకే పొజిషన్‌లో ఉన్నవారు పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేస్తే, పక్కనే వాళ్ల కారు పెట్టినందుకు రాంగ్ పార్కింగ్ చలానా జనరేట్ చేసి మొత్తం 3 చలాన్స్ అయ్యాయి అంటూ కారు సీజ్ చేస్తున్నామని బెదిరించారు. పిటిషన్ కాపీ తీసుకుని సీనియర్ సిటిజన్ దంపతులను కావాలని 4 గంటల పాటు పోలీస్ స్టేషన్‌లోనే ఉంచారు.
లాభాలతో అమ్ముకుని బయటపడే ప్రయత్నం
రూ.50 కోట్ల భూమిని రిజిస్ట్రేషన్ వ్యాల్యూ మాత్రమే సేల్ డీడ్‌లో చూపించారు. అందుకు మొత్తం ఆరా మస్తాన్, తెలంగాణ శ్రీచైతన్య ఓనర్ శ్రీధర్ ఇద్దరు రెండు సేల్ డీడ్స్‌లో రూ.15,27,9500 చూపించారు. డాక్యుమెంట్ నెంబర్ 3452, 3476 ఆఫ్ 2024. మస్తాన్ రూ.20 లక్షలు మాత్రమే 2023 జూలై 24న ఇచ్చినట్లు చూపించారు. మిగితా 5 చెక్స్ ఒక్కొక్కటి రూ.కోటి 89 లక్షలు ఇచ్చినట్లు చూపించారు. కానీ, ఆ చెక్స్ ఆయన చెప్పుకుంటున్న ఓనర్, జీపీఏ హోల్డర్ కు చేరలేదని ‘స్వేచ్ఛ’కి తెలిపారు. శ్రీదర్ వద్ద నుంచి రూ.కోటి 63 లక్షలు మాత్రమే ఆన్ లైన్ వెళ్లినట్లు చూపించారు. మిగితా చెక్స్ ఇవ్వలేదు. వారి చెక్స్ వారి అకౌంట్స్‌లో జమకాకపోతే ఏనాటికైనా అమ్మకందారుడు కోర్టులో కేసు వేసే అవకాశాలు ఉన్నాయి. వాళ్లకు ఆ భూమి కంపెనీల్లో పార్టనర్‌షిప్‌లో పోయిందని తెలుసు కానీ, వ్యక్తుల పేర్లపై 1961లో రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి వాళ్లదే టైటిల్ అంటూ చెబుతున్నారు. యూఎల్సీ యాక్ట్‌లో కంపెనీ ఎత్తేస్తున్నట్లు ల్యాండ్ మినహాయింపులో కూడా వ్యక్తుల పేర్లు ఇవ్వడం కామన్ కానీ, అదే టైటిల్ అనుకుని రూ.50 కోట్ల ఆస్తి రూ.2 కోట్లకే వస్తుంది, పొజిషన్‌కు రూ.3 కోట్లు ఖర్చు పెట్టి రూ.30 కోట్లకు అమ్ముకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. రెండు ఏండ్లలో తాను 20 లక్షలు ఇచ్చి, 20 కోట్లు వస్తాయని ఆశతో తనకు ఉన్న పొలిటికల్, జర్నలిస్టుల పరిచయాలతో పాటు పోలీస్ అధికారులను బుట్టలో వేసుకున్నారు. ఎన్నో దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదంలో దూరి ఇట్లే కొటేయ్యాలన్న ప్లాన్ బెడిసి కొట్టడంతో షేక్ మస్తాన్ షేడ్స్ అన్నీ బయటపెడుతున్నారని పొజిషన్‌లో ఉన్నవారు ఆరోపిస్తున్నారు.
Read Also- Dasari Narayana Rao: తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్ద ఎవరో చెప్పిన నిర్మాత