‘లైలా’ సినిమా భారీ అంచనాల మధ్య వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్రబృందం వరుస అప్డేట్స్ ఇస్తూ హైప్ పెంచారు. అలాగే వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, విశ్వక్ సేన్ మరో అప్డేట్ ఇచ్చారు. లైలా ట్రైలర్ (Laila Trailer) ఫిబ్రవరి 6న విడుదల కాబోతున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
అంతేకాకుండా లైలా, సోనూ మోడల్ పోస్టర్‌ను షేర్ చేశారు. అయితే ఇందులో బ్యూటీ పార్లర్‌లో విశ్వక్ సేన్ మేకప్ ఆర్టిస్ట్‌గా ఉండి బ్రష్, హెయిర్ డ్రైయ్యర్ పట్టుకుని కనిపించారు. వెనక అన్ని మేకప్‌కు సంబంధించిన వస్తువులు ఉండగా.. కుర్చీలో లైలా షాక్ అవుతున్నట్లు ఉన్న లేడీ గెటప్‌లో మాస్ కా దాస్ ఉన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. ఇక అది చూసిన వారంతా నిజంగా అమ్మాయిలా ఉన్నావంటూ కామెంట్లు చేస్తున్నారు.