Urvashi Rautela: ఊర్వశీ రౌతేలా.. ఈ పేరు ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అవుతోంది. తెలుగు వాళ్లు చేసే ట్వీట్స్, కామెంట్స్ అర్థం కాక.. తనపై నెగిటివ్ కామెంట్స్ చేసిన వారికి కూడా ఈ భామ పాజిటివ్‌గా స్పందిస్తూ.. కాంట్రవర్సీలను కొనితెచ్చుకుంటుంది. రీసెంట్‌గా సైఫ్ అలీఖాన్‌పై జరిగిన అటాక్‌పై స్పందిస్తూ కూడా వేలి వజ్రటపు ఉంగరాన్ని చూపిస్తూ మాట్లాడి.. తర్వాత చేసిన తప్పు తెలుసుకుని సారీ చెప్పింది. రీసెంట్‌గా వచ్చిన ‘డాకు మహారాజ్’లోని ‘దబిడి దిబిడి’ సాంగ్‌పై ట్రోలింగ్ చేస్తుంటే.. తననేదో పొగుడుతున్నారనుకుని అందరికీ థ్యాంక్స్ చెబుతూ వచ్చి వార్తలలో నిలిచింది. ఇలా, టాలీవుడ్‌లో అమ్మడి పేరు బాగానే వినబడుతుంది. అసలీ బ్యూటీకి టాలీవుడ్‌లో పేరు తెచ్చిన సినిమా ‘వాల్తేరు వీరయ్య’. ఈ సినిమాలో బాస్ చిరంజీవితో ‘వెర్ ఈజ్ ద పార్టీ’ అంటూ జతకట్టి, హిట్టు కొట్టింది. అంతే, అప్పటి నుండి ఈ భామ పేరు టాలీవుడ్‌లో వినబడుతూనే ఉంది.
ఆ ‘వీరయ్య’ దర్శకుడే రూపొందించిన ‘డాకు మహారాజ్’లో ఏకంగా ఓ పాత్రనే సొంతం చేసుకున్న ఊర్వశి.. ఆ సినిమాతోనూ మంచి విజయాన్నే తన ఖాతాలో వేసుకుంది. ఇక ఆ సినిమా ప్రమోషన్స్‌లో బాలయ్యపై పొగడ్తల వర్షం కురిపించిన ఈ భామ.. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి తనకు దేవుడంటూ తన తాజా ఇంటర్వ్యూలో అసలు విషయం బయటపెట్టేసింది. ఇంతకీ చిరంజీవి ఆమెకి దేవుడు ఎలా అయ్యాడని అనుకుంటున్నారా? ఆ విషయం ఆమె మాటల్లోనే..
Also Read- Samantha: ఎట్టకేలకు విడాకులకు కారణం చెప్పిన సమంత!
‘‘చిరంజీవిగారు చేసే సేవా కార్యక్రమాల గురించి వినడమే కాదు.. స్వయంగా దగ్గరుండి చూశాను కూడా. ఓ కష్టంలో ఆయన నుండి సాయం పొందిన వారి లిస్ట్‌లో నేనూ ఉన్నాను. మా అమ్మ ఎడమ కాలి ఎముకకు పెద్ద సమస్య వచ్చి, ఎక్కడికి వెళ్లినా.. డాక్టర్స్ కష్టం అని చెబుతుంటే, అదే విషయం మెగాస్టార్‌కి చెప్పాను. అడగలేక అడిగితే.. ఆయన రియాక్ట్ అయిన తీరు నన్ను ఆశ్చర్య పరిచింది.
నాకు ధైర్యం చెప్పడమే కాదు.. ఒక సొంత మనిషిలా ఆయన మా అమ్మకు ఉన్న సమస్య గురించి తెలుసుకున్నారు. వెంటనే కలకత్తాలోని అపోలో హాస్పిటల్ డాక్టర్స్‌తో మాట్లాడి, అమ్మకు మెరుగైన వైద్యం అందేలా చేసి, ఒక దేవుడిలా అండగా నిలబడ్డారు. ఎప్పటికప్పుడు అమ్మ ఆరోగ్యంపై ఎంక్వైరీ చేస్తూ.. నాకు కొండంత ధైర్యాన్నిచ్చారు. అమ్మ విషయంలో ఎలాంటి సాయానికైనా సిద్ధంగా ఉన్నాను. అస్సలు భయపడవద్దు అంటూ ఆయన చెబుతుంటే.. నాకు ఆయన దేవుడిలా కనిపించారు. ఆయన చేసిన సాయానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను’’ అంటూ ఊర్వశీ రౌతేలా చెప్పుకొచ్చింది.
ఇక ఈ విషయం తెలిసిన మెగాభిమానులు, ఆమె వీడియోలను షేర్ చేస్తూ.. ‘చిన్న పాయింట్ దొరికితే చాలు ట్రోల్ చేస్తున్నారు కదా.. ఇప్పుడేమంటారు’ అంటూ ట్రోలర్స్‌కి కౌంటర్స్ ఇస్తున్నారు. ‘బ్రహ్మా ఆనందం’ ప్రీ రిలీజ్ వేడుకలో ఇంటినిండా ఆడపిల్లలే అంటూ చిరు చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి: