Samantha on Divorce
ఎంటర్‌టైన్మెంట్

Samantha: ఎట్టకేలకు విడాకులకు కారణం చెప్పిన సమంత!

Samantha: స్టార్ హీరోయిన్ సమంత, యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య విడాకులు తీసుకుని ఎవరి లైఫ్ వాళ్లు లీడ్ చేస్తున్నారు. చైతూ చేతినిండా సినిమాలతో, వెబ్ సిరీస్‌లతో బిజీబిజీగా ఉంటే.. సమంత కూడా బాలీవుడ్, హాలీవుడ్ అంటూ తన దారి తను చూసుకుంటుంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఆమె ఒక్క సినిమా కూడా చేయడం లేదు. అందుకు కారణం ఏమిటనేది పక్కన పెడితే.. మంచి కథ వస్తే తప్పకుండా టాలీవుడ్‌లో చేస్తానంటూ.. ఇటీవల త్రివిక్రమ్‌కు సమంత ఓ పబ్లిక్ ఫంక్షన్‌లో ప్రామిస్ చేసింది. మరి ఎప్పుడు మళ్లీ టాలీవుడ్‌లో సమంత సినిమా చేస్తుందో తెలియదు కానీ.. ఆమె టాలీవుడ్‌లో సినిమా చేస్తే చూడాలని ఆమె అభిమానులందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. మరోవైపు నాగచైతన్య నటి శోభితను రెండో పెళ్లి చేసుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు.

సమంత విషయంలో కూడా మళ్లీ పెళ్లి అంటూ ఈ మధ్య వార్తలైతే వైరల్ అవుతున్నాయి కానీ, క్లారిటీ మాత్రం లేదు. ఓ బాలీవుడ్ దర్శకుడితో ఆమె ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి. అవి ఎంత వరకు నిజమో.. ఆమె చెబితేనే కానీ తెలియదు. ఇక చైతూ, సామ్ విడాకులకు సంబంధించి రకరకాల వార్తలు ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి. అసలు ఎందుకు వారిద్దరూ విడిపోయారు? అనేది మాత్రం ఇంత వరకు క్లారిటీ రాలేదు. మధ్యలో ఈ విడాకులపై అంతా చైతూదే తప్పు అన్నట్లుగా సమంత రియాక్ట్ అయింది కానీ, కారణం మాత్రం చెప్పలేదు. తాజాగా ఆమె ఇన్‌డైరెక్ట్‌గా విడాకులకు కారణం ఏమిటో చెప్పే ప్రయత్నం చేసింది.

జీవిత భాగస్వామి గురించి జే శెట్టి అనే రచయిత చెబుతున్న వీడియోను ఇన్‌స్టాగ్రమ్ వేదికగా షేర్ చేసిన సమంత, అందులోని సారాంశమే, ఆమె విడాకులకు కారణం అన్నట్లుగా తెలిపే ప్రయత్నం చేసింది. ఈ వీడియోలో.. ‘‘మీరు మీ భాగస్వామితో మంచి అనుబంధం కలిగి ఉండవచ్చు, అది మీ మధ్య ప్రేమకు చక్కని సామర్థ్యంగా ఉపయోగపడవచ్చు. కానీ.. మీ శారీరక, మానసిక ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించకపోతే మాత్రం.. మీ భాగస్వామి కోరుకున్న విధంగా మీరు కనిపించలేరు. అది మీ మధ్య దూరానికి కారణం అయ్యే అవకాశం ఉంది’’ అనేలా చెబుతున్న వీడియోను సమంత షేర్ చేసింది.

కొన్నాళ్లుగా ఆమె మయోసైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ ఆ వ్యాధికి సమంత చికిత్స తీసుకుంటూనే ఉంది. చైతూ, సమంతల విడాకులకు కారణం అదే అనేలా సమంత ఈ వీడియో రూపంలో చెబుతుందనేలా అంతా ఆమె పోస్ట్‌ను అర్థం చేసుకుంటున్నారు. మరి నిజంగా అదే కారణమా.. లేదంటే ఇంకా వేరే ఏదైనా కారణం ఉందా? అనేది మాత్రం చెప్పడం కష్టం. ఎందుకంటే, వారిద్ధరి మధ్య ఏం జరిగిందనేది వారు చెప్పరు. ఇలా ఏదో ఒకటి ఇన్ డైరెక్ట్‌గా చెప్పడం తప్ప.. ఇదే కారణం అని ఎవరూ చెప్పలేరు. ఇదిలా ఉంటే.. ‘అయిపోయిందేదో అయిపోయంది. చైతూ మరో పెళ్లి కూడా చేసుకున్నాడు కాబట్టి.. ఇక ఈ విషయానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది’ అని సమంతకు నెటిజన్లు కొందరు హితబోధ చేస్తున్నారు.

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం