Ranveer Allahbadia
ఎంటర్‌టైన్మెంట్

Ranveer Allahbadia: ప్రధాని చేతుల మీదుగా అవార్డు, ఇప్పుడు దారుణంగా ట్రోల్.. ఎవరి రణ్‌వీర్ అల్లాబాదియా?

Ranveer Allahbadia: ప్రస్తుతం సోషల్ మీడియా, జాతీయ మీడియా ఓపెన్ చేస్తే కనిపిస్తున్న, వినిపిస్తున్న పేరు ‘రణ్‌వీర్ అల్లాబాదియా’. సమయ్ రైనా అనే ప్రముఖ కమెడియన్ నిర్వహిస్తున్న ఇండియా గాట్ లేటెంట్(India Got Latent) షోలో రణ్‌వీర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం లేపిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫైనల్‌గా మహారాష్ట్ర పోలీసులు రణ్‌వీర్ ఇంటికి చేరుకొని మిగతా కార్యక్రమాలు పూర్తి చేశారు.

ఈ కేసు గురించి పక్కన పెడితే.. ఇంతకు ఈ రణ్‌వీర్ అల్లాబాదియా, సమయ్ రైనా ఎవరు? ఇండియా గాట్ లేటెంట్ ఏంటి? రణ్‌వీర్ అల్లాబాదియా.. ముంబైలో ఓ ఎలైట్ కుటుంబంలో పుట్టిన రణ్‌వీర్.. ధీరుభాయి అంబానీ స్కూల్ లో స్కూలింగ్ చేశాడు. గ్రాడ్యుయేషన్ అనంతరం 2015లో బీర్ బైసిప్స్(BeerBiceps) పేరుతో యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేశాడు. మొదట ఫిట్ నెస్, కుకింగ్, మోటివేషన్, ఫ్యాషన్, ఫైనాన్స్, సెల్ఫ్ డెవలప్మెంట్ వంటి టాపిక్స్‌పై వీడియోలు చేసిన రణ్‌వీర్ 2019లో ది రణ్‌వీర్ షో(TRS) పేరుతో పాడ్ కాస్ట్ స్టార్ చేశాడు. దీంతో ఆయన కెరీర్ మొత్తం మారిపోయింది. తక్కువ కాలంలోనే ఇండియా నెంబర్ 1 పాడ్ కాస్టర్‌గా ఎదిగాడు. తన రెండు చానెళ్లు రణ్‌వీర్ అల్లాబాదియా(10.4 మిలియన్స్), బీర్ బైసిప్స్(8.21 మిలియన్స్) సబ్ స్క్రైబర్స్‌తో దూసుకుపోయాయి. స్పాటిఫై(Spotify) యాప్ తో అసోసియేట్ అయిన తొలి ఇండియన్ ఇండిపెండెంట్ కంటెంట్ క్రియేటర్ గా హిస్టరీ క్రియేట్ చేశాడు. రాజీవ్ చంద్రశేఖర్, ఎస్ జైశంకర్, స్మృతి ఇరానీ, పీయూష్ గోయల్ వంటి కేంద్ర మంత్రులతో పాటు ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్, మిస్టర్ బీస్ట్ వంటి అంతర్జాతీయ సెలబ్రిటీలు.. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ స్టార్స్, ఎంతో మంది ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు బీర్ బైసిప్స్ షోకు అటెండ్ అయ్యారు. అలాగే 2024లో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా Disruptor of the Year award అవార్డు అందుకున్నాడు. పారిశ్రామిక రంగంలోను ఇన్వెస్టర్‌గా కొనసాగుతున్నాడు. లైఫ్ అంత సాఫీగా సాగుతుంది అనుకున్న తరుణంలో లేటెంట్(India Got Latent) షో పెద్ద షాకిచ్చింది.

ఇండియా గాట్ లేటెంట్

సమయ్ రైనా.. ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ అడ్మయిరింగ్ స్టాండప్ కమెడియన్. డార్క్ కామెడీ అతని ప్రధాన బలం. దాని బేస్డ్ గానే ఇండియా గాట్ లేటెంట్ అనే షో ప్రారంభించాడు. ఈ షో ఎవరు ఊహించినంత సక్సెస్ అయ్యింది. యూట్యూబ్ కొత్త చరిత్రలు రాసింది. బ్రాండ్స్ అన్ని సమయ్ చుట్టూ క్యూ కట్టాయి. కానీ ఇటీవల జరిగిన ఓ ఎపిసోడ్ లో జడ్జ్‌లుగా రణ్‌వీర్ అల్లాబాదియా, ఆశిష్ చంచలాని, అపూర్వ మఖిజా, జస్ప్రీత్ సింగ్ లు హాజరయ్యారు. ఓ మహిళా కంటెస్ట్ తో రణ్‌వీర్ మాట్లాడుతూ.. ‘‘ మీ తల్లిదండ్రులు శృంగారం చేయడం జీవితాంతం చూస్తావా..? లేదా ఒక సారి వారితో కలిసి దీన్ని శాశ్వతంగా ఆపేస్తావా..?’’ అంటూ క్వశన్ చేశాడు. దీంతో తీవ్ర దూరం రేగింది.. వెర్బల్ అబ్యూస్ కింద కేసులు నమోదు అయ్యాయి. దీంతో నేషనల్ మీడియా ఈ వార్తలనే ప్రైమ్ డిబేట్ లుగా ప్రదర్శించింది. మరికొందరు దేశంలో వేరే సమస్యలు లేవా అంటూ కొన్ని ఛానెళ్లపై మండిపడుతున్నారు. ఇప్పటికే రణ్‌వీర్ అల్లాబాదియా క్షమాపణలు చెప్పడం, సమయ్ అన్ని వీడియోలను తొలిగించడం తెలిసిన విషయమే.

Just In

01

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు