prabhas-and-anupamkher
ఎంటర్‌టైన్మెంట్

Prabhas: బలవంతుడైన ప్రభాస్‌కి మరింత బలం చేకూరింది..

Prabhas X Anupam Kher: ‘బాహుబలి’తో బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ స్టార్‌గా ఎదిగాడు ప్రభాస్. అయితే బాహుబలి తర్వాత చేసిన కొన్ని ప్రాజెక్టులు ఆశించినంత ఫలితాలు ఇవ్వలేకపోయిన ఆయన స్టార్‌డమ్‌‌పై ఎలాంటి ప్రభావం చూపించలేకపోవడం గమనార్హం. ప్రశాంత్ నీల్ ‘సలార్‌’తో మరోసారి విధ్వంసం సృష్టించిన ప్రభాస్.. డెడ్లి లైనప్‌తో ఈసారి విధ్వంసం సృష్టించేందుకు సిద్దమవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే బలవంతుడికి మరింత బలం చేకూరినట్లు ఓ కొలాబరేషన్ జరిగింది.

ప్రస్తుతం ప్రభాస్ ‘రాజా సాబ్, సలార్ 2, స్పిరిట్, సందీప్ రెడ్డి వంగా ప్రాజెక్ట్, హోంబలే ప్రొడక్షన్ ప్రాజెక్ట్స్’లతో  పాటు దర్శకుడు హను రాఘవపూడితో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ‘సీతా రామం’ వంటి రీజినల్ సినిమాతోనే పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న హను, ఇప్పుడు ప్రభాస్ తో మరో పీరియాడికల్ డ్రామా తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమా కాస్టింగ్ విషయానికొస్తే.. హీరోయిన్ ఇమాన్వీ పేరు మినహా మేకర్స్ ఎవరి వివరాలు బయటపెట్టలేదు.

తాజాగా ఈ సినిమాలోకి బాలీవుడ్ దిగ్గజ నటుడు అనుపమ్ ఖేర్‌కు స్వాగతం పలుకుతూ.. సోషల్ మీడియాలో టీమ్ అప్డేడ్ ఇచ్చారు. అలాగే అనుపమ్ ఖేర్.. ‘‘భారత చిత్ర పరిశ్రమలో బాహుబలిగా పేరుపొందిన ప్రభాస్‌‌తో కలిసి నా 544వ సినిమా చేయడం సంతోషంగా ఉంది. నా ఫ్రెండ్ సుదీప్ ఛటర్జీ డిఓపీగా పనిచేస్తున్నాడు. టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి అద్భుతమైన కథ తెరకెక్కిస్తున్నాడు. జీవితంలో ఇంతకంటే ఇంకేం కావాలి ఫ్రెండ్స్‌.. జయహో’’ అంటూ పోస్ట్ చేశాడు.

బాలీవుడ్ దిగ్గజ నటుడు అనుపమ్ ఖేర్ ఈ ప్రాజెక్ట్ లో జాయిన్ కావడంతో ప్రభాస్ అభిమానులతో పాటు సినీ అభిమానులు ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మొదట ‘ఫౌజి’ అనే వర్కింగ్ టైటిల్ వినపడింది. కానీ ప్రస్తుతం మేకర్స్ #PrabhasHanu అనే హ్యాష్ ట్యాగ్‌తో అప్డేట్స్ అందించడం ఆసక్తికరంగా మారింది.

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?