Director Shankar Next Movie
ఎంటర్‌టైన్మెంట్

Director Shankar: ‘గేమ్ చేంజర్’ తర్వాత శంకర్ ఏ హీరోతో చేస్తున్నారో తెలుసా?

Director Shankar: డైరెక్టర్ శంకర్‌.. ఈ పేరు ఒకప్పుడు సెన్సేషన్. ప్రతి హీరో శంకర్‌తో ఒక్క సినిమా అయినా చేయాలనేంత గొప్ప దర్శకుడిగా పేరు పొంది, ఎందరో నూతన దర్శకులకు స్ఫూర్తిగా నిలిచారు. దర్శకధీరుడు రాజమౌళి వంటి వారే శంకర్ నాకు స్ఫూర్తి అన్నారంటే.. శంకర్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయినా కొంతకాలంగా శంకర్ మ్యాజిక్ పని చేయడం లేదనే చెప్పాలి. వరుస పరాజయాలు ఆయనని వెంటాడుతున్నాయి. ఆయన పేరుకు ఉన్న సెన్సేషన్‌కు మచ్చ తెస్తున్నాయి. ఆయన దర్శకత్వంలో భారీ అంచనాలతో వచ్చిన వరుస చిత్రాలు ‘ఇండియన్ 2’, ‘గేమ్ చేంజర్’ భారీ డిజాస్టర్స్‌గా నిలవడంతో.. శంకర్ దర్శకత్వ ప్రతిభపై అనుమానాలు మొదలయ్యాయి. శంకర్ ఇంకా అప్డేట్ అవ్వలేదనే కామెంట్స్ ఎక్కువయ్యాయి. ఒక మంచి సినిమాతో కమ్ బ్యాక్ ఇస్తే తప్ప.. శంకర్‌పై వస్తున్న విమర్శలకు బ్రేక్ పడని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో అసలు శంకర్ తదుపరి సినిమా ఏంటి? ఏ హీరోతో చేయబోతున్నాడనేలా.. అందరిలో ఆసక్తి నెలకొంది.

ఆ ఆసక్తికి తెరదించుతూ.. శంకర్ తదుపరి సినిమాకు సంబంధించి కోలీవుడ్‌ సర్కిల్స్‌లో ఓ వార్త వైరల్ అవుతోంది. ‘ఇండియన్ 2’, ‘గేమ్ చేంజర్’ భారీ డిజాస్టర్స్‌ తర్వాత శంకర్ చేయబోయే సినిమా హీరో ఇతనే అంటూ ఓ పేరు బాగా హల్చల్ చేస్తుంది. వాస్తవానికి ఈ రెండు సినిమాల తర్వాత శంకర్ ‘ఇండియన్ 3’ కంప్లీట్ చేయాల్సి ఉంది. ఎందుకంటే, ‘ఇండియన్ 2’ సినిమా సమయంలోనే కొంత రష్‌ని మూడో పార్ట్ కోసం శంకర్ సిద్ధం చేసి ఉంచారు. ఆ సినిమా ఎండింగ్‌లో పార్ట్ 3 ఉండబోతున్నట్లుగా ప్రకటించారు. కానీ సినిమా రిజల్ట్ మారిపోవడంతో ‘ఇండియన్ 3’ ఇక ఓటీటీలోనే అనేలా టాక్ మొదలైంది. బ్యాలెన్స్ షూట్ విషయంలో కూడా నిర్మాణ సంస్థ, కోర్టు మెట్లు ఎక్కింది. రెమ్యునరేషన్ లేకుండా శంకర్ మిగతా పార్ట్ పూర్తి చేయాలనేలా కోర్టుకు వెళ్లడంతో ‘ఇండియన్ 3’ ఎప్పటికి వస్తుందో అనేది క్లారిటీ లేకుండా పోయింది.

Also Read- Samantha: ఎట్టకేలకు విడాకులకు కారణం చెప్పిన సమంత!

ఈ లోపు శంకర్ మరో హీరోతో ప్రాజెక్ట్ ఓకే చేసినట్లుగా తెలుస్తోంది. ఆ హీరో ఎవరో కాదు.. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘అపరిచితుడు’, ‘ఐ’ వంటి చిత్రాలలో నటించిన స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్. అవును విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్‌తో శంకర్ తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నాడని కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. విక్రమ్ తన తనయుడిని స్టార్ హీరోని చేయాలని చేయని ప్రయత్నం లేదు. కానీ ఆయన ప్రయత్నాలన్నీ విఫలం అవుతున్నాయి. టాలీవుడ్‌లో సంచలన విజయాన్ని నమోదు చేసిన ‘అర్జున్ రెడ్డి’ని ధృవ్‌ హీరోగా తమిళ్‌లో రీమేక్ చేస్తే.. అది పెద్దగా వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత ధృవ్ చేసిన సినిమాలన్నీ యావరేజ్ టాక్‌కే పరిమితం అవడంతో.. హీరోగా ఎలివేట్ కాలేకపోతున్నాడు.

ఈ నేపథ్యంలో శంకర్‌తో సినిమా అంటే, ధృవ్ రేంజ్ కూడా పెరుగుతుంది. శంకర్ ప్రస్తుత ట్రాక్ రికార్డ్ అంతగా లేనప్పటికీ, ఒక్కసారి ఆయన ఫామ్‌లోకి వస్తే.. బాక్సాఫీస్‌ని షేక్ చేయడం తధ్యం అని నమ్మే విక్రమ్, తన కుమారుడిని శంకర్ చేతుల్లో పెడుతున్నట్లుగా టాక్. ఈ ప్రాజెక్ట్ విషయంలో శంకర్ తన పంథా మార్చి, అతి తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కించాలని చూస్తున్నట్లుగా సమాచారం. అయితే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఇటువంటి వార్తలే కానీ, అధికారిక సమాచారం మాత్రం ఇంత వరకు రాలేదు.

ఇవి కూడా చదవండి: 

Ranveer Allahbadia: ప్రధాని చేతుల మీదుగా అవార్డు, ఇప్పుడు దారుణంగా ట్రోల్.. ఎవరి రణ్‌వీర్ అల్లాబాదియా?

Prabhas: బలవంతుడైన ప్రభాస్‌కి మరింత బలం చేకూరింది..

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం