Thandel : రెండోరోజు తండేల్ కలెక్షన్లు.. ఇదేం ట్విస్ట్..!
thandel
Cinema, ఎంటర్‌టైన్‌మెంట్

Thandel : రెండోరోజు తండేల్ కలెక్షన్లు.. ఇదేం ట్విస్ట్..!

Thandel | తండేల్ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. మొన్న 7వ తేదీన విడుదలైన ఈ మూవీ.. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ముందు నుంచే పాజిటివ్ వైబ్స్ ఉన్న ఈ మూవీకి.. పాజిటివ్ టాక్ రావడంతో మూవీకి ఒక్కసారిగా హైప్ పెరిగిపోయింది. నాగచైతన్య, సాయిపల్లవి కాంబోకు ఉన్న క్రేజ్ మరోసారి హిట్ ట్రాక్ ఎక్కింది. దీంతో సినిమాకు పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. నాగచైతన్య తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని.. సాయిపల్లవి కూడా యాక్టింగ్ తో ఆకట్టుకుందని ప్రశంసలు కురుస్తున్నాయి. కేవలం పబ్లిక్ నుంచే కాకుండా అటు ఇండస్ట్రీ ప్రముఖులు కూడా నాగచైతన్య, సాయిపల్లవి నటనపై పోస్టులు పెట్టడంతో మూవీకి కావాల్సినంత బజ్ ఏర్పడుతోంది. ఇక మొదటి రోజు ఊహించినట్టుగానే మంచి కలెక్షన్లు రాబట్టింది ఈ సినిమా.

శుక్రవారం రూ.21.27 కోట్లు రాబట్టింది ఈ సినిమా. ఇక రెండో రోజు శనివారం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఈ మూవీ కలెక్షన్లను మరింత పెంచుకుంది. శనివారం వీకెండ్ కావడంతో మూవీ ఏకంగా రూ.41.20 వసూలు చేసిందని నిర్మాణ సంస్థ ప్రకటించింది. మొదటి రోజుకంటే రెండో రోజు డబుల్ వసూలు చేయడం అంటే మూవీకి రిలీజ్ కు ముందుకంటే రిలీజ్ తర్వాత మరింత బజ్ పెరిగిందని అర్థం అవుతోంది. దీంతో మూవీ టీమ్ సంబురాలు చేసుకుంటోంది. ఇక ఆదివారం ఈ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని మూవీ యూనిట్ చెబుతోంది. నాగచైతన్య ఈ మూవీతోనే సోలోగా రూ.100 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం ఉందంటున్నారు. తండేల్ కు(Thandel )రూ.90 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. పైగా చాలా చోట్ల సొంతంగానే రిలీజ్ చేశారు. కాబట్టి లాభాలు ఎక్కువగానే వచ్చే అవకాశం ఉంది.

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?