Sivaji: ‘సారీ’ చెప్పిన శివాజీ.. కాంట్రవర్సీ ముగిసినట్లేనా?
Sivaji Sorry (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Sivaji: ‘సారీ’ చెప్పిన శివాజీ.. కాంట్రవర్సీ ముగిసినట్లేనా?

Sivaji: ‘దండోరా’ వేడుకలో తను చేసిన కామెంట్స్‌కు నటుడు శివాజీ (Sivaji) క్షమాపణలు కోరుతూ ఓ వీడియోను విడుదల చేశారు. మంచి చెప్పే ఉద్దేశంలో అలా చెప్పాను తప్పితే, ఎవరినీ అవమానించాలనే ఉద్దేశం తనకు లేదని తెలిపారు. ఈ క్రమంలో రెండు అసభ్యకరమైన పదాలు తన నోటి వెంట వచ్చాయని, ఆ విధంగా మాట్లాడకుండా ఉండాల్సిందని చెబుతూ.. తన మాటలకు హర్టైన వారందరికీ శివాజీ క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన వీడియో..

ఎవరినీ అవమాన పరచాలని కాదు

‘‘సోమవారం సాయంత్రం ‘దండోరా’ ప్రీ రిలీజ్ వేడుక (Dhandoraa Pre Release Event)లో హీరోయిన్స్ ఈ మధ్యకాలంలో ఇబ్బంది పడ్డ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని, నాలుగు మంచి మాటలు చెప్పాలని.. చెప్తూనే, రెండు అసభ్యకర పదాలను మాట్లాడటం జరిగింది. కచ్చితంగా ఆ పదాలతో ఎవరికైనా మనోభావాలు దెబ్బతింటాయి. నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు.. హీరోయిన్లు బయటికి వెళ్లినప్పుడు వేసుకున్న దుస్తులు మంచిగా ఉంటే, మీకు ఇబ్బంది ఉండదమ్మా.. అనే ఉద్దేశం తప్ప, నేను ఎవరినీ అవమాన పరచాలని కాదు. కానీ, ఏది ఏమైనా రెండు అసభ్యకర పదాలు నా నోటి నుంచి వచ్చాయి. దానికి నేను సిన్సియర్‌గా క్షమాపణలు చెబుతున్నాను.

Also Read- Sivaji Comments: శివాజీ కామెంట్స్‌పై బేషరతు క్షమాపణ కోరుతూ.. ‘మా’కు ‘వాయిస్ ఆఫ్ ఉమెన్’ ఫిర్యాదు..

ఆ రెండు పదాలు దొర్లకుండా ఉంటే

నేను ఎప్పుడూ స్త్రీని ఒక మహాశక్తి, ఒక అమ్మవారిలానే చూస్తాను. ఎందుకంటే, నేటి సమాజంలో స్త్రీని ఎంత తక్కువగా చూస్తున్నారో మనందరం చూస్తున్నాం. అటువంటి అవకాశం మనం ఇవ్వవద్దు అని చెప్పే ఉద్దేశంలో.. ఒక ఊరి భాష మాట్లాడాను. అది చాలా తప్పు. అది నాకు తెలుసు. నా ఉద్దేశం మంచిదే కానీ, ఆ రెండు పదాలు దొర్లకుండా ఉంటే, ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. కానీ, ఒకటి మాత్రం చెబుతున్నాను. మంచి చెప్పాలనే ఉద్దేశం తప్ప అవమానపరచాలని కానీ, కించపరచాలనే ఉద్దేశం కానీ నాకు ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఇండస్ట్రీలో ఆడవాళ్ల మనోభావాలు దెబ్బతిన్నందుకు, అలాగే మహిళలెవరైనా దీనిని తప్పుగా అనుకుని ఉంటే.. వారందరికీ నేను క్షమాపణలు చెబుతున్నాను..’’ అని శివాజీ ఈ వీడియోలో చెప్పుకొచ్చారు.

Also Read- Ram Gopal Varma: శివాజీ వ్యాఖ్యలపై రగిలిన చిచ్చు.. వర్మ ఎంట్రీతో పీక్స్‌కు చేరిన వివాదం!

కాంట్రవర్సీ ముగిసినట్లే..

‘దండోరా’ ప్రీ రిలీజ్ వేడుకలో ఆడవాళ్ల డ్రస్సు విషయంలో శివాజీ కామెంట్స్‌పై ఇండస్ట్రీలో పెద్ద దుమారమే రేగుతోంది. చిన్మయి, అనసూయ, మంచు లక్ష్మి వంటి వారంతా సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు. మరోవైపు మంచు మనోజ్ ఓ లేఖను విడుదల చేసి, శివాజీ తరపున తను క్షమాపణలు చెబుతున్నట్లుగా తెలిపారు. ఇక శివాజీ వ్యాఖ్యలపై వర్మ ఆసక్తికరంగా రియాక్టైన విషయం కూడా తెలిసిందే. ఇలా ఇండస్ట్రీలో రచ్చ మొదలైంది. మరోవైపు ఇండస్ట్రీలోని దాదాపు 100 మంది మహిళల తరపున నందినీ రెడ్డి, సుప్రియ యార్లగడ్డ, స్వప్న దత్, మంచు లక్ష్మి, ఝాన్సీ వంటి వారు ‘మా’కు ఫిర్యాదు చేశారు. బేషరణు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వారి డిమాండ్ మేరకు శివాజీ క్షమాపణలు కోరారు కాబట్టి.. ఇంతటితో ఈ కాంట్రవర్సీ ముగిసిపోయిందనే భావించవచ్చు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

RV Karnan: రెండేళ్ల పని పదేళ్లు చేస్తారా? ప్రాజెక్టుల విభాగంపై కమిషనర్ కర్ణన్ తీవ్ర అసహనం!

Harish Rao: అక్రమ కేసులు పెడుతున్న పోలీసుల పేర్లు రాసుకుంటున్నాం : మాజీ మంత్రి హరీష్ రావు!

The Rise Of Ashoka: ‘ది రైజ్ ఆఫ్ అశోక’ నుంచి వచ్చిన రొమాంటిక్ మెలోడీ ఎలా ఉందంటే?

Thummala Nageswara Rao: నష్టపోయిన సోయాబీన్ రైతులకు న్యాయం చేయాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక మలుపు.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుల విచారణకు రంగం సిద్ధం!