Ram Gopal Varma: శివాజీ వ్యాఖ్యలపై వర్మ పోస్ట్ వైరల్..
RGV And Sivaji (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Ram Gopal Varma: శివాజీ వ్యాఖ్యలపై రగిలిన చిచ్చు.. వర్మ ఎంట్రీతో పీక్స్‌కు చేరిన వివాదం!

Ram Gopal Varma: టాలీవుడ్‌లో తాజాగా నటుడు శివాజీ (Sivaji) చేసిన కొన్ని వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. ముఖ్యంగా మహిళల పట్ల, వారి వేషధారణ, చిత్ర పరిశ్రమలోని హీరోయిన్లను ఉద్దేశించి ఆయన మాట్లాడిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో శివాజీ వ్యాఖ్యలను తప్పుబడుతూ మంచు మనోజ్ (Manchu Manoj) ఒక సుదీర్ఘ లేఖను విడుదల చేశారు. ఇతరుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడం, నైతిక విలువల పేరుతో ఇతరులను కించపరచడం సరికాదని ఆయన అందులో పేర్కొన్నారు. మహిళలను నిర్భంధించే హక్కు ఎవరికీ లేదని చెబుతూ శివాజీ తరపున సారీ కూడా చెప్పాడు. మంచు మనోజ్ పోస్ట్ చేసిన ఈ లేఖపై స్పందించిన మంచు లక్ష్మి (Manchu Lakshmi), తన తమ్ముడిని అభినందిస్తూ.. ‘నువ్వు నిజమైన మనిషివి’ అంటూ ట్వీట్ చేశారు. మంచు లక్ష్మి చేసిన ఈ పోస్ట్‌కు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) కూడా రియాక్ట్ అయ్యాడు. సరిగ్గా ఇక్కడే ఈ వివాదం మరో మలుపు తిరిగింది. ఇంకా చెప్పాలంటే పీక్స్‌కి చేరిందని అనుకోవచ్చు.

Also Read- Manoj Manchu: మహిళల వస్త్రధారణపై శివాజీ వ్యాఖ్యలు.. మంచు మనోజ్ షాకింగ్ పోస్ట్!

రంగంలోకి దిగిన వర్మ..

మంచు లక్ష్మి చేసిన ట్వీట్‌కు రిప్లయ్ ఇస్తూ, రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో శివాజీపై విరుచుకుపడ్డారు. వర్మ తన ట్వీట్‌లో.. ‘‘హే శివాజీ.. నీ ఇంట్లో ఉన్న మహిళలు నీలాంటి అనాగరిక, మురికి మనిషిని భరిస్తుంటే అది వారి ఇష్టం. వారికి కావాలంటే నువ్వు మోరల్ పోలీసింగ్ చేసుకో. కానీ సమాజంలోని ఇతర మహిళల గురించి గానీ, ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి గానీ నీ అభిప్రాయాలను నీ దగ్గరే ఉంచుకో..’’ అని పేర్కొన్నారు. శివాజీ పూర్తి పేరు కూడా తనకు తెలియదని పేర్కొంటూనే, వర్మ ఎంతో ఘాటుగా స్పందించడం గమనార్హం. మహిళల వ్యక్తిగత స్వేచ్ఛ విషయంలో జోక్యం చేసుకునే హక్కు ఎవరికీ లేదని ఆయన తన పోస్ట్ ద్వారా స్పష్టం చేశారు. ప్రస్తుతం వర్మ చేసిన ఈ పోస్ట్‌కు కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. అందాన్ని ఆస్వాదించే వర్మకు శివాజీ చేసిన వ్యాఖ్యలు అస్సలు రుచించవు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తుండటం విశేషం.

Also Read- Shambala Buzz: ప్రీమియర్స్ షో బుకింగ్స్‌లో తగ్గేదేలేదంటున్న‘శంబాల’.. సాయికుమార్ హ్యాపీ..

వివాదానికి నేపథ్యమిదే..

సాధారణంగా శివాజీ రాజకీయ లేదా సామాజిక అంశాలపై కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడతారని పేరుంది. అయితే, ఈసారి ఆయన చేసిన వ్యాఖ్యలు మహిళల నైతికతను ప్రశ్నించేలా ఉన్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దీనిని తప్పుబడుతూ సినీ ప్రముఖులు గళం విప్పుతున్నారు. ఆర్జీవీ ఎంట్రీతో ఈ ఇష్యూ ఇప్పుడు ‘వ్యక్తిగత విమర్శల’ స్థాయికి చేరుకుంది. మొత్తానికి, మంచు మనోజ్ లేఖతో మొదలైన ఈ వివాదం, వర్మ ఎంట్రీతో మరింత ముదిరింది. ఒకరి వ్యక్తిగత జీవితాన్ని లేదా వృత్తిని జడ్జ్ చేసే హక్కు ఎవరికీ లేదనే పాయింట్‌ను ఇక్కడ అందరూ హైలైట్ చేస్తున్నారు. మరి ఈ విమర్శలపై శివాజీ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఈ విషయంలో శివాజీకి కూడా భారీగా మద్దతు లభిస్తుండటం విశేషం. ఆయన చెప్పిన దాంట్లో మంచే ఉంది. కానీ, ఎక్స్‌ప్రెస్ చేసే విధానమే తప్పు అంటూ కొందరు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మొత్తంగా చూస్తే.. ఈ వివాదం చాలా దూరం వెళ్లే అవకాశం అయితే కనిపిస్తోంది. చూద్దాం.. మరి ఏం జరుగుతుందో..

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Sigma Telugu Teaser: దళపతి విజయ్ తనయుడి ‘సిగ్మా’ టీజర్ ఎలా ఉందంటే..

Etela Rajender: హుజురాబాద్ ప్రజల నమ్మకాన్ని నిలబెడతా : ఈటెల రాజేందర్!

Sivaji: ‘సారీ’ చెప్పిన శివాజీ.. కాంట్రవర్సీ ముగిసినట్లేనా?

Sivaji Comments: శివాజీ కామెంట్స్‌పై బేషరతు క్షమాపణ కోరుతూ.. ‘మా’కు ‘వాయిస్ ఆఫ్ ఉమెన్’ ఫిర్యాదు..

Jishnu Dev Varma: అలంపూర్ జోగులాంబ అమ్మవారిని ద‌ర్శించుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ!