Manoj Manchu: తెలుగు చిత్ర పరిశ్రమలో ‘రాక్ స్టార్’గా పేరు తెచ్చుకున్న మంచు మనోజ్ (Rockstar Manchu Manoj), తోటి నటుడు శివాజీ (Sivaji) తాజాగా మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు మనోజ్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఒక సుదీర్ఘమైన నోట్‌ను షేర్ చేస్తూ, మహిళల గౌరవం, రాజ్యాంగ హక్కుల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. అంతేకాదు, శివాజీ తరపున తాను సారీ చెబుతున్నట్లుగా ఇందులో పేర్కొన్నారు. ఇక శివాజీ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే నెట్టింట దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. చిన్మయి (Chinmayi), అనసూయ (Anasuya) వంటి వారు సోషల్ మీడియా వేదికగా శివాజీపై ఫైర్ అవుతున్నారు. ఇలాంటి సమయంలో విషయం పెద్దది కాకూడదని మంచు మనోజ్ చేసిన ఈ పోస్ట్ ఉందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఇంతకీ మనోజ్ చేసిన ఈ పోస్ట్‌లో ఏముందంటే..
Also Read- Emmanuel: ఇమ్మానుయేల్‌కు ఇంత అన్యాయమా? ఏంటిది బిగ్ బాస్?
వస్త్రధారణపై వివక్ష అంగీకరించలేం
శివాజీ వ్యాఖ్యలను ఉద్దేశించి మనోజ్ స్పందిస్తూ.. ‘‘మహిళలు వేసుకునే బట్టలను బట్టి వారిని జడ్జ్ చేయడం లేదా వారిపై నైతిక బాధ్యతను మోపడం అనేది చాలా నిరాశ కలిగించే విషయం. ఇలాంటి ఆలోచనా విధానానికి ఎప్పుడో కాలం చెల్లిపోయింది. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. గౌరవం అనేది ఒకరి ప్రవర్తన నుంచి రావాలి కానీ, మహిళలను అవమానించడం ద్వారా కాదు’’ అని పేర్కొన్నారు. ముఖ్యంగా సమాజాన్ని ప్రభావితం చేసే స్థానాల్లో ఉన్న పబ్లిక్ ఫిగర్స్ మాట్లాడేటప్పుడు ఎంతో బాధ్యతగా ఉండాలని ఆయన హితవు పలికారు. ఇలాంటి వ్యాఖ్యలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15 మరియు 21 కల్పించిన స్ఫూర్తిని దెబ్బతీస్తాయి. సమానత్వం, గౌరవం, వ్యక్తిగత స్వేచ్ఛ అనేవి చర్చించలేని అంశాలు. మహిళల దుస్తులు పబ్లిగ్గా విమర్శించే సబ్జెక్టులు కావని ఆయన స్పష్టం చేశారు.
Also Read- Telugu Boxoffice: 2025లో ఎక్కువ వసూళ్లు సాధించిన తెలుగు సినిమాలు ఏంటో తెలుసా?
క్షమాపణలు చెబుతున్నాను
ఒక సీనియర్ నటుడిగా మనోజ్ తన బాధ్యతను చాటుకుంటూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ‘‘మహిళలను కించపరిచేలా, వారిని కేవలం వస్తువులుగా చూస్తూ కొందరు సీనియర్ నటులు చేసిన వ్యాఖ్యలకు గానూ నేను బేషరతుగా క్షమాపణలు కోరుతున్నాను. ఇలాంటి మాటలు పురుషులందరి అభిప్రాయం కాదు. ఇలాంటి ప్రవర్తనను మేము సమర్థించలేము, అలా అని చూస్తూ ఊరుకోము. మహిళలకు ఎల్లప్పుడూ గౌరవం, గౌరవప్రదమైన స్థానం, సమానత్వం దక్కాలని, అన్యాయం జరిగినప్పుడు మౌనంగా ఉండటం సరికాదని ఆయన పిలుపునిచ్చారు. మంచు మనోజ్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ‘తప్పు చేసిన వారు ఎవరైనా సరే.. ఆఖరికి తన సొంత అన్న అయినా సరే.. ప్రశ్నించే మనోజ్ ధైర్యం గొప్పది’ అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు మనోజ్ వైఖరిని స్వాగతిస్తున్నారు.
Came across some deeply disappointing comments last night.
A civilised society protects women’s rights instead of policing their choices. #RespectWomen #RespectYourself pic.twitter.com/ym3CmPsxgD
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) December 23, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

