Ranya Rao Case: ప్రముఖ కన్నడ నటి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ పట్టపడటం హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసందే. ఈ కేసులో సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. అయితే రన్యారావు తొలిసారి ఢిల్లీలో, తరువాత బెంగళూరు ఎయిర్‌పోర్టులో పట్టుపడింది. అయితే ఆమె అరెస్ట్ తర్వాత వరుసగా ముగ్గురు వ్యక్తులు బంగారం అక్రమ రవాణా చేస్తూ ఢిల్లీ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులకు చిక్కారు. అయితే రన్యారావుకు ఈ వ్యక్తులతో ఏమైనా సంబంధాలు ఉన్నాయేమో అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ముగ్గురు దగ్గర స్వాధీనం చేసుకున్న బంగారు బిస్కెట్ల నమూనా ఒకేలా ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ముగ్గురు కూడా ఒకేరోజు బంగారం స్మగ్లింగ్ చేస్తూ దొరికారు. ఈనెల 2న ఈ ముగ్గురు వ్యక్తులు పట్టుపడగా.. తెల్లారి మార్చి 3న రన్యారావు అరెస్ట్ అయ్యింది.
ఆ తర్వాత ముంబై ఎయిర్‌పోర్టులో ఇద్దరు వ్యక్తులు బంగారం రవాణా చేస్తూ పట్టుపడ్డారు. కిలోల కొద్దీ గోల్డ్ కడ్డీలను అక్రమంగా రవాణా చేస్తూ.. డీఆర్ఐ అధికారులకు పట్టుపడ్డారు. ఈ ఇద్దరు కూడా మార్చి 3న అరెస్ట్ అయ్యారు. అయితే ఈ మూడు ప్రదేశాల్లో అధికారులు స్వాధీనం చేసుకున్న బంగారం అంతా కూడా దుబాయ్ నుంచి రవాణా అయినట్టు అధికారులు తెలిపారు. అయితే రాన్యారావు, అరెస్టయిన ఈ స్మగ్లర్ల వెనుక ఒక పెద్ద ఇంటర్నేషనల్ సిండికేట్ ఉండవచ్చని డీఆర్ఐ అధికారులు అనుమానిస్తున్నారు. స్మగ్లింగ్ చేసే ముఠా పెద్దగా ఉండొచ్చని అనుకుంటున్నారు. రన్యారావు కేసులో మరికొందరు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. రన్యారావు ప్రస్తుతం డీఆర్ఐ అధికారుల కస్టడీలో ఉంది. ఆమెను రేపటి వరకు జ్యుడీషియల్ కస్టడీకి తీసుకోనున్నారు. మరోవైపు రన్యారావు రేపు బెయిల్ దరఖాస్తు దాఖలు చేసే ఛాన్స్ కూడా ఉంది.
Also Read: రష్మికాకు అండగా నిలిచిన సీనియర్ నటిపై ట్రోల్స్
అయితే బెంగళూర్ ఎయిర్‌పోర్ట్‌లో గోల్డ్ అక్రమ రవాణా చేస్తూ రన్యారావు అడ్డంగా బుక్ అయిన సంగతి తెలిసిందే. దుబాయ్ నుంచి బెంగళూరుకు 14.2 కిలోల బంగారం స్మగ్లింగ్ చేస్తూ డీఆర్ఐ అధికారులకు చికింది. మొత్తం ఆమె దగ్గర నుంచి 14.2 కిలోల బంగారం స్వాధీన పరుచుకున్నారు. అటు ఆమె ఇంట్లో కూడా సోదాలు నిర్వహించి, రూ.2 కోట్ల విలువైన ఆభరణాలు, మరో రూ.2 కోట్లకుపైగా నగదు సీజ్ చేశారు. మొత్తంగా ఈ కేసులో రన్యారావు నుంచి రూ.17.29కోట్ల విలువైన బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు.రన్యారావు ఈ ఏడాదిలో పలుసార్లు దుబాయ్‌కి వెళ్లి రావడం అధికారులు గుర్తించారు. మొత్తం 15 సార్లు దుబాయ్‌కి వెళ్లినట్టు అధికారులు వెల్లడించారు. గత 15 రోజుల్లో 4 సార్లు దుబాయ్‌కి వెళ్లి రావడంతో అధికారులు రన్యారావుపై నిఘా పెట్టారు. ఇక దుబాయ్‌కి వెళ్లిన ప్రతిసారి రకరకాలైన దుస్తువులు ధరించడం గుర్తించారు. దీంతో ఆమెపై నిఘా పెంచి ఫాలో చేయడం మొదలు పెట్టి చివరకు అడ్డంగా పట్టుకున్నారు.