RT76: మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) నటించిన 75వ చిత్రం ‘మాస్ జాతర’ (Mass Jathara) బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. ఈ సినిమాపై మేకర్స్, అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కానీ, వారి ఆశలు నెరవేరలేదు. వరసగా రవితేజ అకౌంట్‌లో మరో ఫ్లాప్ చేరింది. అయినా కూడా ఇది ఆయన కెరీర్‌పై ఎటువంటి ప్రభావం చూపలేదనే చెప్పాలి. ప్రస్తుతం రవితేజ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. అందులో మినిమమ్ గ్యారెంట్ డైరెక్టర్ కిషోర్ తిరుమల (Kishore Tirumala) డైరెక్ట్ చేస్తున్న సినిమా కూడా ఉంది. రవితేజ 76వ సినిమాగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను బిగ్ కాన్వాస్‌పై స్టైలిష్‌గా మేకర్స్ రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాను రాబోయే సంక్రాంతి బరిలో దించేందుకు ఏర్పాట్లు జరుగుతున్న విషయం తెలిసిందే.
Also Read- Vijay Sethupathi: పూరీతో చేస్తున్న సినిమా అయ్యేలోపు తెలుగులో మాట్లాడతా.. కవితలు కూడా రాస్తా!
రవితేజ76 అప్డేట్ ఇదే..
సంక్రాంతి సినిమాల లిస్ట్‌లో ఈ సినిమాను కూడా లెక్కేసుకుంటున్నారు. కానీ మేకర్స్ ఈ మధ్య కాలంలో ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. దీంతో అసలు ఈ సినిమా ఉందా? అనేలా కూడా అనుమానాలు వచ్చాయి. ఆ అనుమానాలకు తెరదించుతూ.. తాజాగా మేకర్స్ ఓ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా వచ్చిన అప్డేట్ ఏమిటంటే.. హీరోయిన్ ఆషికా రంగనాథ్ (Ashika Ranganath), రవితేజలపై హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేసిన ప్రత్యేకమైన సెట్‌గా సాంగ్ షూట్ చేస్తున్నారట. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో రూపొందుతోన్న ఈ పాట.. అదిరిపోయే డ్యాన్స్ నంబర్‌గా ఉంటుందని మేకర్స్ తెలిపారు. ఇందులో రవితేజ, ఆషికా కెమిస్ట్రీ కూడా అదిరిపోతుందని, ప్రేక్షకులకు కనుల విందులా ఈ పాటను శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారని టీమ్ వెల్లడించింది.
Also Read- MLA Sanjay Kumar: హృదయ విదారక ఘటన.. డబ్బులు లేక తల్లిని మోసుకుంటూ ఆసుపత్రికి తీసుకెళ్లిన కొడుకు
ఫుల్-ఫ్లెడ్జ్డ్ ఫ్యామిలీ డ్రామా
దీంతో ‘మాస్ జాతర’ పరాజయంతో నిరాశలో ఉన్న అభిమానులందరికీ ఈ వార్త గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ప్రస్తుతం వారి ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టుకున్నారు. ఎందుకంటే, కిషోర్ తిరుమల చిత్రాలు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌గా ఉంటాయి. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఆయన సినిమాలను రూపొందిస్తుంటారు. రవితేజ కోసం కూడా ఆయన మంచి ఫవర్ ఫుల్ సజ్జెక్ట్‌ని రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు, ఎలక్ట్రిక్ ఎనర్జీతో ప్రేక్షకులను అలరించే రవితేజ.. ఈ సినిమాలో న్యూ స్టైలిష్ లుక్‌లో కనిపించనున్నారనేలా టాక్ నడుస్తుంది. ఇది హ్యూమర్, ఎమోషన్, రవితేజ మాస్ ఎలిమెంట్స్‌తో ఫుల్-ఫ్లెడ్జ్డ్ ఫ్యామిలీ డ్రామాగా ఉంటుందని, ఈ సినిమాతో కచ్చితంగా రవితేజకు హిట్ వస్తుందని చిత్రబృందం కూడా నమ్మకంగా చెబుతోంది. ఈ సినిమాకు కూడా భీమ్స్ సెసిరోలియోనే మ్యూజిక్ అందిస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
