Shiva 4K Trailer: తెలుగు సినిమా చరిత్రను శివ సినిమాకు ముందు శివ తర్వాత అనే చెప్పుకునే విధంగా చేసిన సినిమా మరలా మరో సారి మన ముందుకు రాబోతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ ను విడుదల చేసింది మూవీ టీం. దీనిని చూసిన కింగ్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సినిమా రీ రిలీజ్ కు టాలీవుడ్ బడా హీరోలు మొత్తం మద్ధతు పలుకుతున్నారు. అప్పట్లో ఈ సినిమా విడుదలై చేసిన హంగామాను గుర్తు చేసుకుంటున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమా నవంబర్ 14,2025న 4కే వర్షన్ డాల్డీ సౌండ్ యాడ్ చేసి రీ రిలీజ్ చేయనున్నారు. ఈ ట్రైలర్ చూసిన అభిమానులు సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Read also-Supreme Court: మల్టీప్లెక్సులపై సీరియస్ అయిన సుప్రీం కోర్ట్.. ఎందుకంటే?
తెలుగు సినీ చరిత్రలో ఒక మలుపు తీసుకువచ్చిన చిత్రం అంటే అది రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 1989లో వచ్చిన “శివ”. నాగార్జున, అమల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా కాలేజీ నేపథ్యంలో జరిగే విద్యార్థి రాజకీయాలు, గ్యాంగ్ వార్స్ చుట్టూ తిరుగుతుంది. ఒక సాధారణ యువకుడు సిస్టమ్‌కు వ్యతిరేకంగా ఎలా నిలబడతాడో చూపించిన ఈ కథ, తన యాక్షన్ సన్నివేశాలు, నిజజీవితానికి దగ్గరగా ఉన్న ప్రదర్శనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ముఖ్యంగా సైకిల్ చైన్ ఫైట్ సీన్ సినిమాకు ఐకానిక్ సీక్వెన్స్‌గా మారింది. రఘువరన్ చేసిన విలన్ పాత్ర, నాగార్జున పెర్ఫార్మెన్స్, ఇళయరాజా సంగీతం అన్నీ కలిసి సినిమాను ఒక సూపర్ హిట్ మూవీగా మలిచాయి. అలాంటి సినిమా ప్రస్తుత టెక్నాలజీకి తగ్గట్టుగా తయారై మరలా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో శివ కల్ట్ చూసేందుకు కింగ్ ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు.
Read also-The RajaSaab: ‘రాజాసాబ్’పై వస్తున్న వదంతులకు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. అది మాత్రం పక్కా..
