Pushpa 2 OTT | అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘పుష్ప2: ది రూల్’. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ‘పుష్ప 2’ జనవరి 30న నెట్‌ఫ్లిక్స్ వేదికగా అందుబాటులోకి వచ్చింది. తాజాగా ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లోనూ రికార్డు సృష్టించింది. ఓటీటీలోకి వచ్చిన నాటినుంచి వ్యూస్ పరంగా టాప్‌లో ఉన్న ‘పుష్ప 2’ తాజాగా ఏడు దేశాల్లో నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా హాలీవుడ్ మినహాయించి ఇతర సినిమాల విభాగంలో 5.8 మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది. టోటల్ నెట్ ఫ్లిక్స్ లోనే రెండో స్థానంలో నిలబడింది.
తెలుగు సినిమా విభాగానికి సంబంధించి పుష్ప 2 సినిమా నెట్ ఫ్లిక్స్ లో ప్రధమ స్థానం అందుకుంది. ఈ వీక్షణల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని మేకర్స్ భావిస్తున్నారు. మొదట 3 గంటల 20 నిమిషాల నిడివితో విడుదలైన ‘పుష్ప 2’కు అదనంగా ఇటీవల మరో 20 నిమిషాల సన్నివేశాలను జత చేశారు. ఇక ఓటీటీ వెర్షన్ కూడా ఇదే నిడివితో అందుబాటులో ఉంది. ‘పుష్ప 2’ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ ఆడియన్స్ ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రత్యేకించి జాతర ఎపిసోడ్‌కు వారంతా ఫిదా అవుతున్నారు. ఎక్స్ వేదికగా ఆ సీన్స్‌ను షేర్ చేస్తూ చిత్రబృందాన్ని అభినందిస్తున్నారు. తన అన్న సినిమాకు ఈ స్థాయి ఆదరణ లభించడం, ప్రశంసలు అందుకోవడం ఎంతో సంతోషదాయకం అని అల్లు శిరీష్ హర్షం వ్యక్తం చేశారు.