prodduturu-dasara(image :x)
ఎంటర్‌టైన్మెంట్

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!

Proddatur Dasara: కథను చెప్పడంలో సినిమా పాత్ర ఎంత ఉందో అవే జరిగిన కథలను చెప్పడంలో డాక్యుమెంటరీల పాత్ర కూడా అంతే ఉంది. అలాంటి కథతోనే మన ముందుకు రాబోతుంది ఓ డాక్యుమెంటరీ. బాల్కనీ ఒరిజినల్స్, బుశెట్టి జువెల్లర్స్ సమర్పణలో ప్రేమ్ కుమార్ వలపల నిర్మాతగా తీసిన డాక్యుమెంటరీ ‘ప్రొద్దుటూరు దసరా’. మురళీ కృష్ణ తుమ్మ ఈ డాక్యమెంటరీని తెరకెక్కించారు. ఈ డాక్యుమెంటరీని శుక్రవారం (సెప్టెంబర్ 5)న ప్రదర్శించారు. ఈ ప్రత్యేక ప్రదర్శనకు కరుణ కుమార్, విప్లవ్, మహేష్ విట్టా, ఉదయ్ గుర్రాల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. డాక్యుమెంటరీ స్క్రీనింగ్ అనంతరం.. పలువురు ప్రముఖులు మాట్లాడారు.

Read also-Nude Gang: నగ్నంగా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ .. ‘ఓ ఘటన లేదా, వ్యక్తికి సంబంధించిన విషయాల్ని, నిజాల్ని చూపించే డాక్యుమెంటరీస్ ఉంటాయి. ఓ సరైన డాక్యుమెంటరీకి సినిమా కంటే పెద్ద రీచ్‌ ఉంటుంది. డాక్యుమెంటరీ అంటే ఎంగేజింగ్‌గా ఉండదని అంతా అనుకుంటారు. కానీ ఈ ‘ప్రొద్దుటూరు దసరా’ ఎంతో ఎంగేజింగ్‌గా, అద్భుతంగా అనిపించింది. డాక్యుమెంటరీ అంటే ఇలానే తీయాలి అనే నియమాల్ని బద్దలు కొట్టారు. యశ్వంత్ నాగ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆర్ఆర్, పాట విన్నా కూడా గూస్ బంప్స్ వచ్చాయి. ఏఐని వాడుకుని గొప్పగా చూపించారు. ఇంటర్నేషనల్‌ వైడ్‌గా డాక్యుమెంటరీలను ఎన్నో ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శిస్తుంటారు. డాక్యుమెంటరీ అనేది దృశ్యరూపంలో ఉండే చరిత్ర.’ అని అన్నారు.

మహేష్ విట్టా మాట్లాడుతూ .. ‘‘మా ఊర్లో జరిగే దసరా గురించి అందరికీ చెబుతుంటాను. పది రోజుల పాటు పండుగ అదిరిపోతుంది. ఈ డాక్యుమెంటరీలో చూపించిన దాని కంటే ఇంకా బాగుంటుంది. పది టెంపుల్స్‌లో దసరా గొప్పగా జరుగుతుంది. 11 వ రోజు మాత్రం వాహనాలు కూడా వచ్చే స్థలం ఉండదు. శివ కాశీ నుంచి తెచ్చిన క్రాకర్స్‌ని గంట సేపు కాల్చుతారు. ప్రొద్దుటూర్‌లో దసరా అద్భుతంగా జరుగుతుంది’ అని అన్నారు.

దర్శకుడు ఉదయ్ గుర్రాల మాట్లాడుతూ .. ‘నేను కూడా డాక్యుమెంటరీలు తీసి ఇండస్ట్రీలోకి వచ్చాను. నిజాల్ని దాచి పెట్టడం, భావి తరాలకు చూపెట్టడం డాక్యుమెంటరీ. ప్రొద్దుటూరు దసరాని అక్కడి వారికి ఎప్పటికీ గుర్తుండిపోయేలా తీశారు. తెలుగు రాష్ట్రాల్లో దసరాని ప్రొద్దుటూరులో ఇంత గొప్పగా చేస్తారని తెలియదు. ఈ డాక్యుమెంటరీ చూసిన తరువాత ప్రొద్దుటూరు దసరా గొప్పదనం తెలిసింది. అని అన్నారు. నిర్మాత ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ .. ‘‘ప్రొద్దుటూరు దసరా’ ప్రదర్శనకు వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. బాల్కనీ ఒరిజినల్స్‌ని మూడేళ్ల క్రితం ప్రారంభించారు. ఇప్పటి వరకు మా ఏరియా అంటే వయలెన్స్ మాత్రమే ఉంటుందని అంతా అనుకుంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు మా మూలాల్లోని కథల్ని చూపిస్తాను. యశ్వంత్ మ్యూజిక్, నిఖిల్ కెమెరా వర్క్ గొప్పగా వచ్చింది.’ అని అన్నారు.

Read also-A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

జయసింహా మాట్లాడుతూ.. ‘‘ప్రొద్దుటూరు దసరా’ డాక్యుమెంటరీలో అక్కడ జరిగే దృశ్యాల్ని చూపించాం. అని అన్నారు. దర్శకుడు మురళీ కృష్ణ మాట్లాడుతూ.. ‘‘నా వరకు నేను ప్రయత్నించి ఈ డాక్యుమెంటరీని తీశాను. అందరికీ మా డాక్యుమెంటరీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు. నటుడు దావూద్ మాట్లాడుతూ .. ‘మాది ప్రొద్దుటూరు. కరుణ కుమార్ దర్శకత్వంలో ‘శ్రీదేవీ సోడా సెంటర్’ చిత్రంలో నటించాను. మా ఊర్లో దసరా బాగా జరుగుతుందని, సిరి పురం అని, బంగారం ఎక్కువగా ఉంటుందని ప్రతీ ఒక్కరికీ చెబుతుండేవాడిని. ప్రొద్దుటూరులో దసరా బాగా జరుగుతుందని అందరికీ తెలుసు. అయితే ఈ డాక్యుమెంటరీతో ప్రపంచంలోని ప్రతీ ఒక్కరికీ ‘ప్రొద్దుటూరు దసరా’ని చూపించారు’ అని అన్నారు.

Just In

01

Jubilee Hills By Election exit poll: జూబ్లీహిల్స్ బైపోల్స్.. మ్యాజిక్ చేసిన సీఎం రేవంత్.. ప్రతీ వ్యూహం సూపర్ హిట్!

Maganti Sunitha: ఒక మహిళపై ఇంత అరాచకమా..? మాగంటి సునీత

Konda Surekha: నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న కొండా సురేఖ.. అందుకేనా..

Election Code Violation: ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఎమ్మెల్యేలపై కేసులు నమోదు

BRS Complaint: కాంగ్రెస్ నేతలపై ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు