Viral Video: ఉత్తర్ ప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చేసుకుంది. ఓ పోలీసు జంట కాపురంలో వివాహేతర సంబంధం చిచ్చు పెట్టింది. భార్య తన ప్రియుడైన మరో పోలీసుతో ఇంట్లో ఉండగా భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి. మంచి, చెడు చెప్పాల్సిన పోలీసులే ఇంతగా దిగజారి ప్రవర్తించడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే..
కుశీనగర్ జిల్లా కస్యా పట్టణంలోని ఓ అద్దె ఇంట్లో ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసు కానిస్టేబుల్స్ గా పనిచేస్తున్న భార్య భర్తలు ఆ ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఇద్దరిది వేర్వేరు పోలీసు స్టేషన్లు కావడంతో శనివారం రాత్రి భర్త డ్యూటీకి వెళ్లాడు. ఉదయం ఇంటికి తిరిగి వచ్చి చూడగా ఆమె తన ప్రియుడితో ఇంట్లో ఉండటం గమనించాడు. దీంతో ఒక్కసారిగా షాక్ కు గురైన భర్త.. వారిద్దరిపై దాడి చేసి గదిలో బంధించాడు.
Also Read: Viral Video: ఒరేయ్ బుడ్డోడా.. ఎంత పని చేశావ్‌రా.. నీ దెబ్బకు అంతా వణికిపోయారు!
లోపల నుంచి గడి పెట్టుకొని
ఇంట్లో నుంచి పెద్ద ఎత్తున శబ్దాలు వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఇంటి వద్దకు చేరుకున్న పోలీసులు ముగ్గురినీ పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లారు. భార్య ప్రియుడు కూడా కానిస్టేబుల్ గా పనిచేస్తున్నట్లు స్పష్టం చేశారు. అతను అదే జిల్లాలోని మరొక పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్నట్లు చెప్పారు. ఈ విషయం మీద ముగ్గురి మధ్య ఘర్షణ, కొట్లాట జరిగిందని పేర్కొన్నారు. ఆగ్రహంతో భర్త గదికి తాళం వేసి గోల చేశాడని.. భార్య లోపల నుంచి తలుపు వేసుకుందని పేర్కొన్నారు.
यूपी के कुशीनगर में एक पुलिसवाले ने अपनी पत्नी को उसके प्रेमी के साथ पकड़ लिया. पत्नी प्रेमी संग कमरे में थी, तभी पति पहुंच गया. हालांकि पत्नी ने कमरा अंदर से लॉक कर रखा था, उसने तुरंत पुलिस को सूचना दी. फिर पुलिस की मौजूदगी में कमरे का ताला तोड़ा गया. @kushinagarpol pic.twitter.com/MnCRtGpEaj
— baghelpramod (@baghelpramod4) September 1, 2025
Also Read: CM Revanth Reddy: విద్యకు దైవ భూమి కేరళ.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!
ఎస్‌హెచ్ఓ ఏమన్నారంటే?
భర్త ఆరోపణల ప్రకారం.. అతడు డ్యూటీకి వెళ్లినప్పుడల్లా భార్య తన ప్రియుడిని ఇంటికి పిలుచుకునేది. ఎస్‌హెచ్‌ఓ అమిత్‌కుమార్ శర్మ మాట్లాడుతూ ‘ఇది భర్త-భార్యల గొడవ. ఈ విషయంపై దర్యాప్తు జరుగుతోంది. మహిళా కానిస్టేబుల్ భర్త లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చాడు. దానిపై తగిన చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు.