UPI Transactions: యూపీఐ (Unified Payments Interface) పేమెంట్స్ లో సరికొత్త రికార్డ్ నమోదైంది. ఆగస్టు నెలలో తొలిసారి 20 బిలియన్ లావాదేవీలు జరిగాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) డేటా వెల్లడించింది. దాని ప్రకారం గత నెలలో యూపీఐ లావాదేవీలు 20.01 బిలియన్ కు చేరాయి. ఇది జూలై (19.47 బిలియన్)తో పోల్చితే 2.8 శాతం అధికం. గతేడాది ఆగస్టు నెలతో పోలిస్తే 34 శాతం వృద్ధి నమోదైనట్లు ఎన్పీసీఐ నివేదిక స్పష్టం చేసింది.
వివరాల్లోకి వెళ్తే..
విలువ పరంగా ఆగస్టులో యూపీఐ ద్వారా రూ.24.85 లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయి. గతేడాది ఇదే కాలంతో పోల్చితే 24 శాతం పెరుగుదల నమోదైంది. అంతేకాదు రోజువారీ సగటు లావాదేవీల సంఖ్య 645 మిలియన్లకి చేరిందని NPCI రిపోర్ట్ తెలిపింది. జూలైలో 628 మిలియన్లుగా ఉన్నట్లు చెప్పింది. .ఇక దేశంలో రోజూవారి యూపీఐ లావాదేవీల రూ.80,177 కోట్లుగా నివేదిక పేర్కొంది. ఆగస్టు 2న యూపీఐ.. ఒకే రోజు 700 మిలియన్ కు పైగా లావాదేవీలు జరిపి కొత్త రికార్డ్ సృష్టించిందని వివరించింది.
Also Read: CM Revanth Reddy: చంద్రబాబు, పవన్, జగన్, కేసీఆర్‌కు.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి
జూన్, జులై పరిశీలిస్తే..
గత కొద్ది నెలలుగా యూపీఐ లావాదేవీల్లో నిరంతర వృద్ధి నమోదవుతోంది. రియల్ మనీ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లపై నిషేధం ఉన్నప్పటికీ ఆగస్టులో ఈ పెరుగుదల సాధించడం విశేషం. అటు జూన్ లో యూపీఐ 18.40 బిలియన్ లావాదేవీలను (రూ.24.04 లక్షల కోట్లు విలువ) నమోదు చేసింది. జూలైలో ఇది గణనీయంగా పెరిగి 19.47 బిలియన్ లావాదేవీలు (రూ.25.08 లక్షల కోట్లు)కి చేరింది. ఇది జూన్‌తో పోల్చితే 5.8 శాతం ఎక్కువ.
Also Read: Crows: కాకితో జాగ్రత్త.. పగబట్టిందో మీ పని ఔట్.. దాని జీవితాంతం మీరే శత్రువు!
మహారాష్ట్ర టాప్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తాజా రీసెర్చ్ ప్రకారం జూలైలో మహారాష్ట్ర 9.8 శాతం వాటాతో డిజిటల్ చెల్లింపుల్లో ముందంజలో నిలిచింది. తరువాత కర్ణాటక (5.5 శాతం), ఉత్తర ప్రదేశ్ (5.3 శాతం) ఉన్నాయి. ‘పీర్-టు-మర్చంట్ (P2M) లావాదేవీల వాటా విలువలో జూన్ 2020లో 13 శాతం నుండి జూలై 2025లో 29 శాతానికి పెరిగింది. అదే సమయంలో వాల్యూమ్‌లో వాటా 39 శాతం నుండి 64 శాతంకి పెరిగింది. ఇది డిజిటల్ చెల్లింపులు, ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ బలంగా పెరుగుతున్నదని సూచిస్తోంది’ అని నివేదిక తెలిపింది.