Prabhas and Jr ntr AI Images
ఎంటర్‌టైన్మెంట్

Fan War: బట్టతల యుద్ధం.. ఒరేయ్ ఇలా ఉన్నారేంట్రా? అసలు మీరు ఫ్యాన్సేనా?

Fan War: టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతుందో.. అదే స్థాయిలో దానిని చెడు దారిలో వాడటం కూడా జరుగుతుంది అనేదానికి ఉదాహరణ సోషల్ మీడియానే. ఏఐ వచ్చిన తర్వాత ఈ పోకడ మరింత ఎక్కువైంది. మొన్నటి వరకు హీరోయిన్ల డీప్ ఫేక్ వీడియోలపై ఎలాంటి హడావుడి జరిగిందో తెలియంది కాదు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, ఆలియా భట్, కత్రినా కైఫ్, విద్యా బాలన్ వంటి వారంతా ఈ డీప్ ఫేక్ బారిన పడి, తీవ్ర వేదనకు గురయ్యారు. ఇప్పుడిక హీరోల వంతు వచ్చింది అన్నట్లుగా సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. ముఖ్యంగా ఏఐతో టాలీవుడ్ స్టార్ హీరోలు కూరగాయలు అమ్మినట్లుగా, టీ కొట్టు నడుపుతున్నట్లుగా, భారీ ఆకారంలో, స్క్విడ్ గేమ్ ఆడుతూ ఇలా రకరకాలుగా వారిని మార్చి.. సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారు. ఇవి చూడటానికి సరదాగా ఉండటంతో.. అంతా సరదాగా తీసుకున్నారు. కానీ, దీనిని ఫ్యాన్ వార్‌గా తీసుకుంటే ఎలాంటి అనర్థాలు చోటు చేసుకుంటాయో అనేదానికి ఉదాహరణగా ప్రభాస్ (Prabhas), ఎన్టీఆర్ (NTR) ఫ్యాన్స్ మధ్య పెద్ద వారే జరుగుతుంది.

Also Read- Vishwambhara: ‘విశ్వంభర’ స్టోరీ లైన్ చెప్పిన దర్శకుడు.. ఆందోళనలో మెగా ఫ్యాన్స్!

ఇంతకీ ఏం వార్ అనుకుంటున్నారా? ‘బట్టతల యుద్ధం’. మాములుగా మెగా, నందమూరి అభిమానులకు ఎక్కువగా ఫ్యాన్ వార్ జరుగుతుంటుంది. మెగా హీరోలను కించపరిచేలా నందమూరి ఫ్యాన్స్ పోస్ట్‌లు పెడితే, నందమూరి అభిమానులకు కౌంటర్ ఇచ్చేలా ఆ కుటుంబ హీరోలపై మెగా ఫ్యాన్స్ పోస్ట్‌లు పెడుతుంటారు. ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు ఆ హీరో, ఈ హీరో అనేం లేదు. ఈ లిస్ట్‌లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి వారే కాకుండా.. ఆఖరికి కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్‌లను కూడా చేర్చి ఫ్యాన్ వార్స్‌ని రెచ్చగొడుతుంటారు. ఇక ఫ్రెష్‌గా సోషల్ మీడియాలో జరుగుతున్న యుద్ధం ‘బట్టతల యుద్ధం’. ప్రభాస్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య బట్టతల యుద్ధం నడుస్తోంది.

Also Read- Star Actress: ముందు వాటిని పెంచు.. అవకాశాలు వస్తాయి.. ఎన్టీఆర్ హీరోయిన్ కి ఘోర అవమానం?

ముందుగా ఎన్టీఆర్ లేటెస్ట్ ఫొటోని షేర్ చేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ (Prabhas Fans) ఆయనకు ఏదో అయ్యింది.. అందుకే ఇలా అయిపోయాడంటూ కామెంట్స్ చేయడం మొదలెట్టారు. వారికి కౌంటర్ అన్నట్లుగా ‘విగ్’ లేకపోతే మీవాడి పరిస్థితి ఇదంటూ ఏఐలో చేసిన ప్రభాస్ బట్టతల ఫొటోని వైరల్ చేయడం మొదలెట్టారు. ఆ ప్రభాస్ ఫొటోనే కొంచెం మార్చి.. ఎన్టీఆర్ ఫేస్ పెట్టి.. మీవాడు కూడా ఒరిజినల్‌గా ఇలాగే ఉంటాడు. కవర్ చేస్తున్నాడంతే.. అంటూ ప్రభాస్ ఫ్యాన్స్.. అస్సలు తగ్గేదేలే అన్నట్లుగా వైరల్ చేస్తున్నారు. ఇలా ఇద్దరి హీరోల ఫ్యాన్స్ మధ్య ‘బట్టతల యుద్ధం’ బీభత్సంగా మారింది. ఇది చూసిన వారంతా.. ఒరేయ్ అసలు మీరు ఫ్యాన్సేనా? మీరు మీరు కొట్టుకు చావండి? వాళ్లనెందుకు డీ గ్రేడ్ చేస్తున్నారు? ఎవరికి వారు గొప్పు. వాళ్లు బాగానే ఉంటారు, మధ్యలో మీ గొడవలేంటి? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలా వీరి గొడవ ప్రస్తుతం తారా స్థాయికి చేరింది. ఇది ఎక్కడ ఆగుతుందో చూడాలి!

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Anupama Parameswaran: అనుపమపై అసభ్యకర పోస్ట్‌లు పెట్టిన వ్యక్తిని పట్టేశారట!

Sreeleela: శ్రీలీల సపోర్ట్‌‌తో.. ప్రియదర్శి, ఆనందిల ‘పెళ్లి షురూ’

Janhvi Kapoor: మళ్లీ అందాలేనా? ఈసారైనా పెర్ఫార్మెన్స్‌తో మెప్పిస్తుందా?

Shiva Re Release: జెన్-జి‌ని మెప్పించే కంటెంట్‌ ‘శివ’లో ఏముంది? ఎందుకు ఈ సినిమా చూడాలి?

Andhra King Taluka: ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ సాంగ్ అప్డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే?